Site icon HashtagU Telugu

Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?

Hyderabad Vs Earthquakes Telangana Hyderabad City

Hyderabad Vs Earthquakes: హైదరాబాద్‌ మహా నగరం సేఫేనా ? దానికి భూకంపాల ముప్పు ఎంత ? సిటీ పరిధిలోని భూగర్భంలో ఉన్న ఫలకాల స్వభావం ఏమిటి ?  గత పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించిన భూకంపాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ?  అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఈవివరాలతో కథనమిది.

Also Read :New BJP Chief: రామ్ మాధవ్‌కు బీజేపీ చీఫ్ పదవి ? కారణాలు బలమైనవే !

హైదరాబాద్‌లో భూకంపం వస్తే.. ఎలా ?

భూకంపాలకు ప్రపంచంలోని ఏ ప్రాంతమూ అతీతం కాదు. ఎక్కడైనా భూకంపం సంభవించే ముప్పు ఉంటుంది. హైదరాబాద్‌ నగరం, దాని శివార్లలో ఇప్పటివరకు  196 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2021 నుంచి ఇప్పటివరకు సిటీ పరిధిలో దాదాపు పదిసార్లు భూప్రకంపనలు వచ్చాయి. 2024 డిసెంబ‌రు 4న రిక్టరు స్కేలుపై  5.0 తీవ్రతతో హైదరాబాద్‌లో భూకంపం వచ్చింది. హైద‌రాబాద్‌కు 298 కిలోమీట‌ర్ల దూరంలో మహారాష్ట్రలోని లాతూరులో 1993 సెప్టెంబరు 30న భారీ భూకంపం చోటుచేసుకుంది.  ఆనాడు 6.2 తీవ్రతతో వచ్చిన  భూకంపానికే  లాతూర్ నగరం కూలిపోయింది. 10వేల మంది చనిపోగా, 30వేల మంది గాయపడ్డారు. దాదాపు రూ.130 కోట్ల ఆస్తినష్టం జరిగింది. అంతే తీవ్రతతో హైదరాబాద్‌లో  భూకంపం వస్తే.. ఎలా ? భాగ్యనగరంలో ఉన్న భారీ సైజు అపార్టుమెంట్లు తట్టుకోగలవా ? అవి కూలితే.. ఎంతటి విపత్తు సంభవిస్తుంది ? అనే ఆందోళనలు ఎంతోమందిని చుట్టుముడుతున్నాయి. భూకంపాలను తట్టుకునేలా భారీ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారా ? అనే ప్రశ్న ఉదయిస్తోంది.నగరంలో ప్రత్యేకించి గచ్చిబౌలి వంటి ఐటీ పరిశ్రమలు కొలువుదీరిన ప్రాంతాల్లో 150కిపైగా అంతస్తులతో భారీ టవర్లు నిర్మించారు. వెయ్యి మంది నివసించేందుకు అవకాశం ఉన్న చోట లక్ష మంది నివసిస్తున్నారు. అలాంటి ఏరియాల్లో భూకంపం వస్తే భారీ ప్రాణ నష్టం జరుగుతుందనే భయాలు ఉన్నాయి.

Also Read :Microsoft 50th Anniversary : మైక్రోసాఫ్ట్‌కు 50 వసంతాలు.. బిల్‌గేట్స్ సమక్షంలో ఉద్యోగుల నిరసన.. ఎందుకు ?

హైదరాబాద్‌పై ఎఫెక్ట్ ఎంత ?