Site icon HashtagU Telugu

Revanth : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం – సీఎం రేవంత్

Education and work in Young India are my brand: CM Revanth Reddy

Education and work in Young India are my brand: CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తిని బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని వీ హబ్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని ప్రకటించారు. అంబానీ, అదానీలతో పోటీ పడే స్థాయికి మహిళలను తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందిరాగాంధీలా మహిళల కోసం చట్టాలను తీసుకువచ్చే ధైర్యం కాంగ్రెస్‌దే అని అన్నారు.

Tulsi: తులసి మొక్కను ఇలా పూజిస్తే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి కట్టుబడి ఉంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అమ్మ ఆదర్శ పాఠశాలలు, యూనిఫార్మ్ కుట్టుపని, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ వ్యాపారాల వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యత మహిళల చేతుల్లోకి అప్పగించబడింది. అవసరమైతే మరో 1000 మెగావాట్ల ఉత్పత్తి అవకాశాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు.

Tomatoes: టమాటాలు ప్రతిరోజు తినవచ్చా తినకూడదా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

మహిళల ఆర్థిక క్రమశిక్షణను కొనియాడిన సీఎం, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన అప్పులు ఎగ్గొట్టిన సందర్భాలను గుర్తుచేస్తూ, మహిళలు మాత్రం ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా అప్పులను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే అతిథులకు మహిళల తయారీ ఉత్పత్తులనే బహుమతులుగా అందించడం ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలను కూడా స్వయం సహాయక సంఘాల్లో చేర్పించే దిశగా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ గారు స్పష్టంచేశారు.