తెలంగాణలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)పై రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. BCలకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు ఇవ్వకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎమ్మెల్సీ కవిత (Kavitha) హెచ్చరించారు. తక్షణం 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతి వార్డులో వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Maha Shivalayam : ఏడాదిలో 27 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పై విమర్శలు గుప్పించిన ఆమె, BCల హక్కుల విషయంలో కేంద్ర అనుమతి తీసుకురావాలన్నారు. కేంద్రం అనుమతించకపోతే జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకో చేపడతామని ప్రకటించారు. BC జనగణనను బేఖాతరు చేయడం, వారు న్యాయమైన వాటా పొందకుండా ఎన్నికలు నిర్వహించడమంటే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని కవిత పేర్కొన్నారు.
Health : కోడి గుడ్డే కదా అని తినకుండా లైట్ తీసుకుంటున్నారా? మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే?
అలాగే ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. ఏపీలో నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు, బొల్లాపల్లి రిజర్వాయర్ వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ, వాటిని సీఎం రేవంత్ తక్షణం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నదుల జలాల విషయంలో తెలంగాణ ప్రజల హక్కులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. BCల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమం ముమ్మరం చేస్తామని కవిత స్పష్టం చేశారు.