Rythu Panduga Sabha : రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ఏడాది పాలనా కాలంలో రైతుల అభ్యున్నతి కోసం రూ.54వేల కోట్లు ఖర్చుచేశామని ఆయన వెల్లడించారు. ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ (Rythu Panduga Sabha) ప్రసంగించారు.
Also Read :Spa Center : స్పా సెంటర్‌లో క్రాస్ మసాజింగ్.. పెద్దసంఖ్యలో కండోమ్స్, గంజాయి
సరిగ్గా ఏడాది క్రితం నవంబర్ 29న తెలంగాణ ప్రజలు నిరంకుశ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని రేవంత్ గుర్తు చేశారు. కృష్ణమ్మ పారుతున్నా పాలమూరు జిల్లా ప్రజల కష్టాలు తీరకపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్నారు. రైతు సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ ప్రక్రియలో భాగంగా 3,13,897 మంది రైతులకు రూ.2747.67 కోట్ల చెక్కును సీఎం రేవంత్ ఈసందర్భంగా అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులను రైతు పండుగ సభావేదిక నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు.
Also Read : Maharashtra New CM : డిసెంబరు 5న కొలువుతీరనున్న ‘మహాయుతి’ సర్కారు.. సీఎంగా ఆయనకే ఛాన్స్!
నీళ్లు, నియామకాల లక్ష్యాన్ని నెరవేరుస్తాం : డిప్యూటీ సీఎం భట్టి
‘‘నీళ్లు, నియామకాల కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైంది. ఆ లక్ష్యాలను నెరవేర్చే దిశగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు.
Also Read :Amazon : హోమ్ షాపింగ్ స్ప్రీతో మీ ఇంటికి శీతాకాలం సొగసులు..
కృష్ణా, గోదావరి జలాల్లో నీటివాటాలపై సీఎం రేవంత్ సమీక్ష
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ నిర్దేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులను ఆయన అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థతి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.