తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion) తుదిదశకు చేరుకుంది. సుదీర్ఘంగా ఎదురుచూసిన ఈ ప్రక్రియపై కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, కొత్త నేతలకు అవకాశాలు కల్పించే దిశగా కేబినెట్ లో రూపురేఖలు రూపొందించారు. మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ఇద్దరిపై వేటు ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతనంగా ఐదుగురు నేతల పేర్లు ఖరారయ్యాయని సమాచారం. ప్రముఖ నేత విజయశాంతి(VIjayashanthi)కి మంత్రి పదవి దక్కడం ఖాయం అన్నట్లు తెలుస్తుంది.
Telangana Cabinet: ఈ నెల 5న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ?!
ఐదుగురు కొత్త మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు కేటాయించే ప్రణాళిక సిద్ధమైంది. ఓసీ కోటాలో రెడ్డి వర్గానికి ఇద్దరు అవకాశం దక్కే అవకాశముంది. మరోవైపు, ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరికి స్థానచలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఈ పదవులు కోల్పోతున్న వారికి పార్టీ లో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ పేరు కొత్తగా తెర మీదకు రావడం, అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేసులో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
IPL Final: ఐపీఎల్ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్లాన్.. వర్షం వచ్చినా కూడా మ్యాచ్ జరుగుతుందా?
జూన్ 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మహేష్ తో కలిసి పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలవనున్నారు. కేబినెట్ విస్తరణకు అధికారిక ఆమోదం తీసుకుని వెంటనే రాష్ట్రంలో ప్రక్షాళన చేపట్టాలని భావిస్తున్నారు. రాబోయే జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు కీలకంగా మారనున్నాయి.