Valentines Day : ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల దినోత్సవం అని భావించే యువతలో, బయటకు వెళ్లి స్వేచ్ఛగా గడపాలన్నా భయభ్రాంతులు నెలకొంటాయి. ప్రధానంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు యువజంటలను టార్గెట్ చేస్తారని, కనిపించినవారిని బలవంతంగా పెళ్లి చేయిస్తారని ఒక భయం ఉంటుంది. పార్కులు, రోడ్లు, పబ్లు, క్లబ్బుల వద్ద యువ జంటలు కనబడితే తాళి కట్టాలని బలవంతం చేస్తారన్న ఆందోళనతో ప్రేమికులు బయటకు రావాలనే ఆలోచన చేయడానికే భయపడుతుంటారు. అయితే ఈ ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, తమ లక్ష్యం వాలెంటైన్స్ డేను వ్యతిరేకించడం కాదని, పుల్వామా అమర జవాన్లను స్మరించడం మాత్రమే అని బజరంగ్ దళ్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Viral News : రంగారెడ్డి కోర్టులో కలకలం.. జీవితఖైదు విధించిన జడ్జిపై నిందితుడి చెప్పు దాడి
ప్రేమికుల దినోత్సవం రోజున తమ లక్ష్యం “బ్యాన్ వాలెంటైన్స్ డే – ప్రమోట్ వీర జవాన్ దివస్” అని విశ్వహిందూ పరిషత్ (VHP) , భజరంగ్ దళ్ నేతలు చెబుతున్నారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే తమ ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేస్తున్నారు. వాలెంటైన్స్ డే పేరుతో సంస్కృతిని కాలరాస్తున్న కార్యక్రమాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తామని బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు తెలిపారు.
“మేము ప్రేమకు వ్యతిరేకం కాదు. కానీ వాలెంటైన్స్ డే పేరుతో యువత అనవసరపు వికృత చేష్టలకు పాల్పడటం, మద్యం విందులు, అసభ్య కార్యక్రమాలు జరుగుతుండటమే మా వ్యతిరేకతకు కారణం,” అని శివరాములు చెప్పారు. యువతను వాలెంటైన్స్ డేలో పాల్గొనకుండా నిరోధించడమే కాకుండా, పుల్వామా అమరుల త్యాగాన్ని స్మరించేలా వీర జవాన్ దివస్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ సంయుక్తంగా ఫిబ్రవరి 14న పుల్వామా అమరులకు ఘన నివాళి అర్పించాలని యువతకు విజ్ఞప్తి చేశారు. కేవలం వ్యతిరేకతతో కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రేమ పేరుతో విపరీతాలకు పోవడం కంటే పుల్వామా అమరుల త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడం యువతకు నిజమైన దేశసేవ అని అభిప్రాయపడ్డారు.
వాలెంటైన్స్ డేను పాశ్చాత్య సంస్కృతి ప్రభావంగా కొందరు భావిస్తే, మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా చూస్తున్నారు. ముఖ్యంగా పుల్వామా అమరుల త్యాగాన్ని స్మరించడం మంచిదే కానీ, ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేకమైన రోజు కావాలని అనేవారు కూడా ఉన్నారు.
“ప్రేమకంటే పెద్ద ప్రేమ భారతమాత పట్ల ఉండాలి. ఫిబ్రవరి 14ను పుల్వామా అమరులకు అంకితం ఇస్తూ వీర జవాన్ దివస్‌గా జరుపుకుందాం. దేశ సేవలో తరిద్దాం.” అని భజరంగ్ దళ్ నేతలు చివరగా యువతకు పిలుపునిచ్చారు.
President Rule: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాతో రాష్ట్రపతి పాలన!