Site icon HashtagU Telugu

Top Mystery : KCR నోట రేవంత్ రెడ్డి పేరు ఎందుకు రాదు..? అదేం మిస్ట‌రీ.!

Congress list

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (Top Mystery) బీఆర్ఎస్ కార్న‌ర్ చేస్తోంది. ఉచిత విద్యుత్ విష‌యంలో నోరుజారిన రేవంత్ ను గ‌త రెండు వారాలుగా టార్గెట్ చేసింది. ఆయ‌న మీద రైతు వ్య‌తిరేకి ముద్ర వేసింది. వ్య‌వ‌సాయ‌దండ‌గ‌న్న‌ట్టు చంద్ర‌బాబును ఉద‌హ‌రిస్తూ ఆయ‌న ఏజెంట్ గా చిత్రీక‌రించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడ‌ర్ రేవంత్ దిష్టిబొమ్మ‌ల‌ను త‌గుల‌బెట్టింది. నానా హంగామా సృష్టిస్తూ ఆయ‌న్ను పీసీసీ చీఫ్ గా తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తోంది. రైతుల‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోరుతోంది. ఇలా జ‌ర‌గ‌డం రేవంత్ రెడ్డికి పాజిటివ్ అంటూ ఆయ‌న వ‌ర్గీయులు భావిస్తున్నారు. అంతేకాదు, ఉచిత విద్యుత్ కామెంట్స్ త‌ద‌నంత‌రం ప‌రిణామాలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేవిగా ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని  బీఆర్ఎస్ కార్న‌ర్(Top Mystery)

రాజ‌కీయాల్లో ఆరితేరిన రేవంత్ రెడ్డికి ఏది మాట్లాడినా స‌మ‌ర్థించుకునే శ‌క్తి ఉంది. స‌న్న‌కారు రైతుల‌కు మూడు గంట‌ల విద్యుత్ చాలంటూ చేసిన కామెంట్ల వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ చేసింది. దాన్ని రాజ‌కీయ కోణం నుంచి (Top Mystery) తీసుకెళ్లి దుమారం రేపింది. దీంతో జ‌రిగిన న‌ష్టాన్ని అమెరికా నుంచి రాగానే పూడ్చే ప్ర‌య‌త్నం మొదలుపెట్టారు రేవంత్. ఉచిత విద్యుత్ ను కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు 9 గంట‌లు కూడా ఇవ్వ‌డంలేద‌ని తేల్చేశారు. ఎక్క‌డైనా 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా ఇచ్చిన‌ట్టు లాక్ బుక్ చూపించాల‌ని స‌వాల్ విసిరారు. క‌నీసం 8 గంట‌ల ఉచిత విద్యుత్ ఇచ్చిన‌ట్టు రికార్ట్ చూపించ‌గ‌ల‌రా? అంటూ ఛాలెంజ్ చేశారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ల ప‌రిధిలోని రైతుల‌ను అడుగుదామంటూ ర‌చ్చ చేశారు రేవంత్. దీంతో లాక్ బుక్ ల‌ను ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ల నిర్వాహ‌కుల నుంచి తీసుకుంది. ఫ‌లితంగా హామీ మేర‌కు కేసీఆర్ స‌ర్కార్ విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌లేద‌ని తేలిపోయింది.

దమ్ముంటే త‌న పేరును ఉచ్చ‌రించ‌మ‌ని ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి

మ‌రో స‌వాల్ కూడా పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి విసిరారు. గ‌జ్వేల్ నుంచి ఈసారి పోటీ చేసే ద‌మ్ము కేసీఆర్ ఉందా? అంటూ (Top Mystery) నిల‌దీశారు. సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ, ఇప్పుడున్న‌ సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇచ్చే ద‌మ్ములేని కేసీఆర్ అంటూ విమ‌ర్శ‌ల‌కు దిగారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు 80 మంది ఓడిపోతార‌ని భ‌య‌ప‌డుతోన్న బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ పై చేసిన కామెంట్ల‌ను వ‌క్రీక‌రించి ప్ర‌చారం చేస్తోంద‌ని దుయ్య‌బట్టారు. అదే స‌మ‌యంలో ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డానికి కొంద‌రు కాంగ్రెస్ కోవ‌ర్టుల‌తో క‌లిసి కేసీఆర్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి పేరు చెప్పి మాట్లాడే ధైర్యం కేసీఆర్ కు లేద‌ని బ‌రాబ‌ర్ రేవంత్ స‌వాల్ విసిరారు.

అమెరికాలో చేసిన ఉచిత విద్యుత్ కామెంట్ ను వ్య‌క్తిగ‌త కోణంలోకి రేవంత్ రెడ్డి

వాస్త‌వంగా కేసీఆర్ నోటి నుంచి ఎప్పుడూ రేవంత్ రెడ్డి పేరు విన‌లేదు. ప‌లు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు కేసీఆర్ మీద రేవంత్ చేశారు. అంతేకాదు, ఆయ‌న ముక్కు, మూతి గురించి కూడా రేవంత్ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. కొన్ని సంద‌ర్భాల్లో బూత‌పురాణం కూడా వినిపించారు. బ‌హుశా రేవంత్ రెడ్డి తిట్టినన్ని తిట్లు, చేసిన‌న్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు మ‌రెవ‌రూ కేసీఆర్ మీద చేసి ఉండ‌రు. అయిన‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రోజూ రేవంత్ రెడ్డి పేరును ప్ర‌స్తావిస్తూ ఆయ‌న మాట‌లాడేందుకు (Top Mystery) ధైర్యం చేయ‌లేదు. అందుకే, దమ్ముంటే త‌న పేరును ఉచ్చ‌రించ‌మ‌ని ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఛాలెంజ్ ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అవుతోంది.

Also Read : Revanth Reddy : రైతు వేదిక‌లు రాజ‌కీయ వేదిక‌లు కానివ్వొద్దు.. రైతుల‌కు రేవంత్ పిలుపు

అమెరికాలో చేసిన ఉచిత విద్యుత్ కామెంట్ ను పూర్తిగా వ్య‌క్తిగ‌త కోణంలోకి రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా తీసుకెళ్లారు. ఇప్పుడు రేవంత్ వ‌ర్సెస్ కేసీఆర్ కోణం నుంచి మాట్లాడుకునే ప‌రిస్థితికి వెళ్లింది. ఇదే స‌మ‌యంలో వెనుకబ‌డిన వ‌ర్గాల‌ను బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. నాయూబ్రాహ్మ‌ణులు, ర‌జ‌కుల‌ను కించ‌ప‌రిచేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన‌ట్టు ప్ర‌చారం చేస్తోంది. వాళ్ల‌ను ఉద్య‌మం దిశ‌గా రేవంత్ పై తీసుకెళ్ల‌డానికి ఎమ్మెల్సీ సార‌య్య రంగంలోకి దిగారు. ఇక బీసీల‌ను ఐక్యం చేసి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయ‌డానికి మంత్రులు శ్రీనివాస గౌడ్‌, శ్రీనివాస‌యాద‌వ్, గంగుల క‌మలాక‌ర్ త‌దిత‌రులు సిద్ధ‌మ‌య్యారు. కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తోన్న బీసీ నాయ‌కులు ఇక నుంచి రేవంత్ రెడ్డి ఎక్క‌డ కనిపిస్తే అక్క‌డ నిల‌దీసేలా దిశానిర్దేశం చేశారు.

Also Read : BRS vs Congress : రైతుల‌కు రేవంత్ క్ష‌మాప‌ణ చెప్పాలి : రాజ్య‌స‌భ స‌భ్యుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత బ‌ల‌ప‌డుతోన్న కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి ప‌లు ప్ర‌య‌త్నాల‌ను బీఆర్ఎస్ చేస్తోంది. ఆ క్ర‌మంలో మూకుమ్మ‌డిగా రేవంత్ రెడ్డి మీద రాజ‌కీయ దాడికి దిగుతోంది. ఆయ‌న మాట్లాడిన అస‌భ్య ప‌ద‌జాలాన్ని సీరియ‌స్ గా తీసుకుంది. వాటిని హైలెట్ చేస్తూ తెలంగాణ స‌మాజంలో ఆయ‌న్ను చుల‌క‌న చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. అందుకు ప్ర‌తిగా కేసీఆర్, కేటీఆర్ వాడిన ప‌ద‌జాలాన్ని రేవంత్ రెడ్డి వ‌ర్గీయులు సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. మొత్తం మీద ఉచిత విద్యుత్ వ్య‌వ‌హారం వ్య‌క్తిగ‌తం వైపు మ‌ళ్లించ‌డంలో రేవంత్ స‌క్సెస్ అయ్యారు. కానీ, కాంగ్రెస్ సీనియ‌ర్లు మాత్రం ఆయ‌న వాల‌కాన్ని కొంద‌రు అభ్యంత‌రం పెట్ట‌డం గ‌మ‌నార్హం.