Tollywood and Politics :`హిమాన్ష్`మార్క్! `మూడో త‌రం` ముస్తాబు!!

Tollywood and Politics: సీఎం కేసీఆర్ మ‌న‌వ‌డు,మంత్రి కేసీఆర్ కుమారుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్ష్ రావు. త‌ర‌చూ రాజ‌కీయ తెర‌మీద కనిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 02:34 PM IST

Tollywood and Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేసీఆర్ కుమారుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్ష్ రావు. త‌ర‌చూ రాజ‌కీయ తెర‌మీద కనిస్తున్నాడు. వ‌య‌స్సు 18ఏళ్లు దాటుతోన్న క్ర‌మంలో రాజ‌కీయాల‌కు పరిచ‌యం చేసే దిశ‌గా క‌ల్వ‌కుంట్ల కుటుంబం అడుగులు వేస్తోంది. భారత న్యాయ‌స్థానాల్లో పెండింగ్ ఉన్న కేసుపై తీర్పు వ‌స్తే 18ఏళ్ల‌కే అసెంబ్లీకి పోటీ చేసే అవ‌కాశం రానుంది. ఒక వేళ ఆ విధంగా రాక‌పోయిన‌ప్ప‌టికీ 21 ఏళ్ల‌కు అసెంబ్లీకి పోటీ చేయ‌డానికి హిమాన్ష్ ను సిద్దం చేస్తున్న‌ట్టు తాజా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

రాజ‌కీయ రంగంలోకి హిమాన్ష్ వెళ్ల‌నున్నాడా?(Tollywood and Politics)

నేరుగా రాజ‌కీయ రంగంలోకి హిమాన్ష్ వెళ్ల‌నున్నాడా? టాలీవుడ్ ను (Tollywood and Politics)ఏల‌డానికి మార్గం సుగ‌మ‌మం అవుతుందా? అనే చ‌ర్చ క‌ల్వ‌కుంగ్ల అభిమానుల్లో న‌డుస్తోంది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ప్ర‌ధాన రంగాలు అన్నీ క‌ల్వ‌కుంట్ల కుటుంబం అండ‌ర్లోనే మెలుగుతున్నాయి. మీడియా, రియ‌ల్ ఎస్టేట్, విద్య‌, వైద్య, ఫార్మా, ఐటీ, రాజ‌కీయ‌, సినీ రంగాల‌న్నీ క‌ల్వ‌కుంట్ల క‌నుస‌న్న‌ల్లోనే ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. వీటితో పాటు న్యాయ‌, నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ల్లోనూ ఆ కుటుంబం ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌త్య‌ర్థులు ప‌లు సంద‌ర్భాల్లో చేసిన విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. టోట‌ల్ గా తెలంగాణ స‌మాజానికి రారాజుగా కేసీఆర్ , యువ‌రాజు గా కేటీఆర్, యంగ్ త‌రంగ్ రూపంలో హిమాన్స్ దూసుకొస్తున్నాడు. అంటే, మూడోత‌రం చేతిలోకి తెలంగాణ స‌మాజం వెళుతుంద‌న్న సంకేతాలు క్లియ‌ర్ గా క‌నిపిస్తున్నాయి.

మూడోత‌రం చేతిలోకి తెలంగాణ స‌మాజం వెళుతుంద‌న్న సంకేతాలు

పిన్న‌వ‌య‌స్సుల్లోనే హిమాన్స్ సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆ స‌ర‌దా అన‌ధికారికంగా తీర్చుకున్నాడు. స‌చివాల‌యంలోని కేసీఆర్ కుర్చీలో కూర్చున్నప్పుడు వివాద‌స్ప‌దం అయింది. ఆ త‌రువాత భ‌ద్ర‌చ‌లం రాములోరి క‌ల్యాణం రోజు త‌లంబ్రాల‌ను సీఎం హోదా లేక‌పోయిన‌ప్ప‌టికీ షాడో సీఎంలా తీసుకెళ్లి ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను బాల్యంలోనే చ‌విచూశాడు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలోని తియ్య‌దనాన్ని బాల్యంలోనే హిమాన్స్ కు తాత కేసీఆర్ రుచి చూపించారు. ఆ దిశ‌గా ఇప్పుడు అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే, తాజాగా కల్వకుంట్ల హిమాన్షు దాదాపు కోటి రూపాయల నిధులు సేకరించి గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశాడు. దాన్ని పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన సభ‌లో తొలి ప్ర‌సంగం చేసి మూడోత‌రం రాబోతుంద‌న్న (Tollywood and Politics) సంకేతం ఇచ్చేశాడు.

Also Read : Kalvakuntla Himanshu: తాత స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు : కేసీఆర్ మనువడు హిమాన్షు

స్కూల్ ను ఆధునీక‌రించ‌డంతో పాటు ప్రారంభోత్స‌వంలో హిమాన్స్ చేసిన ప్ర‌సంగాన్ని ప్ర‌త్య‌ర్థులు వివాద‌స్ప‌దం చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పాఠ‌శాల‌ల‌ను కూడా ద‌త్త‌త తీసుకోవాల‌ని కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్స్ చేశారు. మీ తాత కేసీఆర్ తొమ్మిదేళ్ల పాల‌న‌లో పాఠ‌శాల‌లు దుస్థితిపై నిజాలు చెప్పావంటూ కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా హిమాన్స్ ను ఆడుకున్నారు. ఇదంతా గ‌త మూడు వారాల నుంచి న‌డిచిన ప్ర‌చారం. అది చ‌ల్లార‌క ముందే హిమాన్స్ సాంగ్ వ‌స్తుందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయ‌డం రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మా? టాలీవుడ్ ఎంట్రీకి మార్గాన్ని  (Tollywood and Politics)సుగ‌మ‌మం చేస్తున్నారా? అనే చ‌ర్చ‌కు ఆస్కారం ఇస్తోంది. కొత్త పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా హిమాన్షు తెలిపాడు.

Also Read : KTR Son Himanshu : విద్యార్ధి దశలోనే మంచి పనులు.. గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చిన KTR తనయుడు

సినీ రంగం మీద ప‌ట్టు కోసం చాలా కాలంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌స్తుతం ఆ రంగం మీద అధికార ఆదిప‌త్యం కొన‌సాగిస్తున్న‌ప్ప‌టికీ ప‌ట్టు దొర‌క‌డంలేదు. ఒకానొక స‌మ‌యంలో విజ‌య్ దేవర‌కొండ ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా వెల‌మ సామాజిక‌వ‌ర్గం ప‌ట్టును సినీ రంగం మీద సాధించాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, లైగ‌ర్ సినిమాతో బూమ్ రాంగ్ అయిందట‌. ఇక ఇప్పుడు హిమాన్ష్ రూపంలో టాలీవుడ్ మీద ప‌ట్టు కోసం మంత్రి కేటీఆర్ ట్రై చేస్తున్నార‌ని టాక్. అందుకే, హిమాన్స్ సాంగ్ ను ప్ర‌మోట్ చేస్తున్నార‌ని క‌ల్వ‌కుంట్ల అభిమానుల్లోని చ‌ర్చ‌. నేరుగా రాజ‌కీయాల్లోకి హిమాన్స్ ఎంట్రీ ఇస్తారా? సినిమా రంగంలో లక్ ను ప‌రీక్షించుకుని రాజ‌కీయాల్లోకి హిమాన్స్ ను దించుతారా? (Tollywood and Politics) అనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.