Fake Passport Scam : నకిలీ సర్టిఫికెట్లతో శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి మన దేశ పాస్‌పోర్టులు ఇప్పించిన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. తెలంగాణ సీఐడీ దర్యాప్తులో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పోలీసులను సీఐడీ విభాగం అరెస్టు చేసింది. గతేడాది హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న సమయంలో నకిలీ పాస్‌పోర్టు ముఠాకు ఈ ముగ్గురు సహకరించినట్లు తేలింది. పంజాగుట్ట ఎస్బీ విభాగంలో పనిచేసి ప్రస్తుతం షీటీంలో ఏఎస్సైగా ఉన్న గుంటూరు వెంకటేశ్వర్లు, మారేడ్‌పల్లి ట్రాఫిక్ ఏఎస్సై తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్సై షేక్ నజీర్ బాషను సీఐడీ అరెస్ట్ చేసింది. వీరితోపాటు ఎస్ఆర్నగర్లోని ఆధార్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు కొప్పిశెట్టి కల్యాణ్‌ను కూడా సీఐడీ రిమాండ్‌కు తరలించింది.
We’re now on WhatsApp. Click to Join
- హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ హిల్స్ బడీ మసీదు ప్రాంతానికి చెందిన అబ్దుస్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారిగా సాగిన బోగస్ పాస్‌పోర్టుల వ్యవహారం ఈ ఏడాది జనవరిలోనే వెలుగు చూసింది.
- అప్పట్లోనే ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సిబ్బంది సహా 12 మంది ఏజెంట్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
- సత్తార్ ముఠాకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ఆదిలాబాద్‌లో ఎస్బీ సిబ్బందికి డబ్బు ఆశ చూపించి దందా సాగించారు.
- ఒక్కో పాస్‌పోర్టు విచారణ కోసం ఎస్బీ సిబ్బందికి వేలల్లో ముట్టజెప్పి పని కానిచ్చారు. విద్యార్హత, ఆధార్ తరహా గుర్తింపు పత్రాలన్నీ బోగస్‌వే అయినా సత్తార్ ముఠా మాయలో పడిన ఎస్బీ సిబ్బంది మోసాన్ని గుర్తించలేకపోయారు.
- సత్తార్ ముఠా ఇప్పటివరకు 95 మంది శ్రీలంక శరణార్థులతో పాటు మరో 30 మంది ఇతర దేశస్థులకు బోగస్ పత్రాలతో భారత పాస్‌పోర్టులు ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు.
- నకిలీ పాస్ పోర్టులు పొందిన విదేశీయుల సమాచారాన్ని తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలంగాణ సీఐడీ విభాగం పంపించింది.
Also Read : Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ?
ఎవరీ సత్తార్ ?
- ఫేక్ పాస్‌పోర్ట్ స్కాంలో(Fake Passport Scam) కీలక సూత్రధారిగా ఉన్న అబ్దుస్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ తొలుత నాంపల్లిలో గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ పని చేసేవాడు.
- 2011లో అతడు నకిలీపత్రాలు సృష్టించే దందాకు తెరలేపాడు.
- చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు బ్రోకర్‌తో పరిచయం ఏర్పర్చుకుని నకిలీ పత్రాలు సృష్టించినందుకు 75 వేల రూపాయలు ముట్టజెప్పేవాడు.
- శ్రీలంక దేశస్థులతోపాటు శరణార్థులతో మంచి సంబంధాలు కలిగిన సదరు బ్రోకర్‌కు నకిలీ ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్ని సమకూర్చేందుకు సత్తార్ డీల్ కుదుర్చుకున్నాడు.
- సత్తార్ చూపించిన డబ్బు ఆశతో.. అతడికి ఎస్బీ అధికారులు సహకరించారు.