Cabinet Meeting : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు (మార్చి 6) జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో దాదాపు 35 అంశాలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణ, 42% రిజర్వేషన్లపై పేపర్, ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండీఏ యాక్టు, టూరిజం పాలసీ, మైనింగ్ పాలసీ, భూభారతి మార్గదర్శకాలు, బీర్ల ధర పెంచిన విషయం మీద ఎక్సైజ్ శాఖ నోట్, ఎండోమెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలను చర్చించనున్నట్టు సమాచారం.
Read Also: Friendship Scam : కొంపముంచిన ఆన్‌లైన్ ఫ్రెండ్.. బాలికకు రూ.80 లక్షలు కుచ్చుటోపీ
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైనా ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణలో బీసీ కులగణనను సర్వే నిర్వింహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. అయితే కులగణలో కొందరు వివరాలు నమోదు చేసుకోకపోటవంతో రెండోసారి నిర్వహించారు. ఈ అంశంపైనా మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. కాగా, ‘ఇందిరా మహిళా శక్తి’ని బలోపేతం చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇటీవల స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ పంపులను సైతం కేటాయించింది.
అలాగే ఎస్సీ వర్గీకరణపై నివేదిక అందగా.. అందులోని గ్రూపుల విభజనపై పలు వర్గాల నుంచి వినతులు వచ్చాయి. ఈ అంశంపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, HMDA పరిధిని హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించటం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సుల్లో ఓనర్లుగా మహిళా సంఘాలకు అవకాశమివ్వడం వంటి కార్యక్రమాలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. వీటితోపాటు మరికొన్ని కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అమలు చేయడంపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.
Read Also: Singer Kalpana: సూసైడ్ చేసుకోలేదు.. సింగర్ కల్పన క్లారిటీ