Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్ అనేది అత్యంత భద్రత కలిగిన ప్రదేశం. దీనిలో అంతటా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎంతోమంది భద్రతా సిబ్బంది పహారా ఉంటుంది. అయినా హైదరాబాద్ నగరంలోని సోమాజీగూడలో ఉన్న రాజ్‌భవన్‌లో చోరీ జరిగింది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో ఉన్న నాలుగు హార్డ్ డిస్కులు చోరీకి గురయ్యాయి. ఈవిషయాన్ని స్వయంగా రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. దీనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read :Car Door Lock: విజయనగరం కారు డోర్‌లాక్ ఘటన.. మనం ఏం నేర్చుకోవాలి ?
సాధారణంగానైతే రాజ్‌భవన్‌లోకి ఎవరిని పడితే వారిని అనుమతించరు. ఎవరు రాజ్‌భవన్(Raj Bhavan)లోకి వచ్చినా.. వారి వివరాలను రిజిస్టర్‌లో రాస్తారు. రాజ్‌భవన్‌లోకి బయటి నుంచి వచ్చిన వారు ఈ పని చేశారా ? ఇంకా ఎవరైనా వాటిని తీసుకెళ్లారా ? హార్డ్ డిస్కులను ఎలా చోరీ చేశారు ? అనేది తెలియాలంటే ముమ్మర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఈవిచారణలో గెస్టుల రిజిస్టర్, సీసీ కెమెరా ఫుటేజీ, సుధర్మ భవన్ పరిధిలో ఉండే సిబ్బంది ఇచ్చే సమాచారం కీలకంగా మారనుంది.