Kavitha Politics : కేసీఆర్‌తో కవితకు గ్యాప్ రావడానికి కారణం అదేనట..

వాస్తవానికి గతంలో విజయశాంతి, ఈటల రాజేందర్ లాంటి ఎంతోమంది దిగ్గజ నేతలు బీఆర్ఎస్‌‌(Kavitha Politics)లో ఈవిధంగా అణచివేతకు గురై కామ్‌గా తమ దారిని తాము చూసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Brs Mlc Kavitha Kcr Ktr Politics

Kavitha Politics : కల్వకుంట్ల కవిత.. సాధారణ నాయకురాలేం కాదు. ఆమెకు ఘన నేపథ్యం ఉంది. కవిత తండ్రి కేసీఆర్‌ గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమైన ధీరుడు, వీరుడు, శూరుడు కేసీఆర్. ఆయనను తెలంగాణ గడ్డ ఎన్నడూ మర్చిపోదు. కేసీఆర్ స్థాపించిన చారిత్రక రాజకీయ పార్టీయే బీఆర్ఎస్. ఇప్పుడు ఈ పార్టీలోనే కవితకు ప్రాధాన్యత లేకుండా పోయింది. కేవలం కేటీఆర్‌కే టాప్ ప్రయారిటీ లభిస్తోంది. ఇలా ఎందుకు ? అనే ప్రశ్న కవిత మనసులో ఉదయిస్తోంది. ఎక్కడైనా సరే అణచివేత ఎదురైనప్పుడు, ప్రతిఘటన మొదలవుతుంది.  ఇప్పుడు బీఆర్ఎస్‌లో కవిత అణచివేతకు గురవుతున్నారు. అందుకే ఆమె ఇప్పుడు ప్రశ్నించడం, విమర్శించడం, లాజికల్‌గా మాట్లాడటం మొదలుపెట్టారు. వాస్తవానికి గతంలో విజయశాంతి, ఈటల రాజేందర్ లాంటి ఎంతోమంది దిగ్గజ నేతలు బీఆర్ఎస్‌‌(Kavitha Politics)లో ఈవిధంగా అణచివేతకు గురై కామ్‌గా తమ దారిని తాము చూసుకున్నారు. ఇప్పుడు కవిత వంతు వచ్చింది. దీంతో ఆమె కూడా తనదారిని తాను చూసుకునేందుకు సిద్ధమవుతున్నారట.

Also Read :Seaplane Services : ఏపీలోని 3 లొకేషన్ల నుంచి సీ ప్లేన్ సర్వీసులు

కేసీఆర్‌తో కవితకు గ్యాప్ ఎందుకు వచ్చింది ?

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. దీంతో ఆమె కొన్ని రోజుల పాటు ఢిల్లీలోని తిహార్ జైలులో ఉండాల్సి వచ్చింది.
  •  జైలు నుంచి విడుదలయ్యాక కొన్ని వారాల పాటు కవిత సైలెంటుగా ఉండిపోయారు. రాజకీయాలపై పెద్దగా మాట్లాడలేదు. ఎవరినీ విమర్శించలేదు.
  • ఆ విరామ కాలంలోనే ఒకసారి కేసీఆర్‌తో కవిత భేటీ అయినట్లు తెలుస్తోంది. తనకు కేటీఆర్‌తో సమానమైన పార్టీ పదవిని ఇవ్వాలని అడిగారట.
  • రోజులు గడిచినా ఈ విషయంపై కేసీఆర్ నుంచి కవితకు ఆశించిన రిప్లై రాలేదని సమాచారం.
  • ఈక్రమంలోనే రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని కవితకు కేటీఆర్ సూచించారట.  ఆతర్వాత కేసీఆర్ కూడా కవితకు అదే విధమైన సలహా ఇచ్చారట.
  • దీంతో మళ్లీ రాజకీయంగా యాక్టివేట్ కావడానికి కవిత తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలు చేపట్టారు. ఈరకంగా కేటీఆర్, కేసీఆర్‌ల సూచనలను ఆమె పక్కన పెట్టారు.
  • రాజకీయ సమీకరణాల విషయంలో కేసీఆర్‌తో గ్యాప్ పెరగబట్టే.. మూడు వారాల క్రితం కేసీఆర్‌కు కవిత లేఖ రాశారని అంటున్నారు. నేరుగా కేసీఆర్‌ను కలిసి ఈ అంశాలపై చర్చించే వీలే ఉంటే.. కవిత ఈవిధంగా లేఖ రాసేవారే కాదని పరిశీలకులు చెబుతున్నారు.
  •  బీఆర్ఎస్‌లో కేటీఆర్ వర్గానికి ప్రస్తుతం బలమైన పట్టు ఉంది. హరీశ్ రావు లాంటి కీలక నేత కూడా కేటీఆర్ వెంటే ఉన్నారు. ఇక ఇదే సమయంలో కవిత మద్దతుదారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కేసీఆర్ వద్ద కవిత తగిన రాజకీయ ప్రాధాన్యతను పొందలేకపోతున్నారు.
  • బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత, రాజకీయ భవిష్యత్తు గురించి కేసీఆర్ నుంచి కవిత క్లారిటీని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండు అంశాల్లోనూ కేసీఆర్ నుంచి కనీస హామీ లభించకుంటే కొత్త పార్టీ పెట్టుకోవడమే బెటర్ అని కవిత భావిస్తున్నారట.
  Last Updated: 26 May 2025, 12:11 PM IST