తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) హౌస్ అరెస్ట్ (Arrest) కావడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ లో పర్యటించనుండటంతో ఈ ప్రాంతంలో భారీ ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈ సభను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై, పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
Saudi Arabia T20 : గ్రాండ్ శ్లామ్ తరహాలో టీ20 లీగ్.. రూ.4,300 కోట్లతో సౌదీ రెడీ
ఈ క్రమంలో తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ చేసారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. వీరిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ మరింత ఉద్రిక్తతను రేపుతోంది. సీఎం పర్యటన ప్రశాంతంగా పూర్తికావాలన్న ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Ajwain : పరగడపున వాముని తీసుకుంటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
మరోవైపు శివునిపల్లి వద్ద 50 వేల మందితో “ప్రజాపాలన” బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో పాటు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొననున్నాయి. సభకు వచ్చే ప్రజల కోసం జర్మన్ టెక్నాలజీ టెంట్లు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. సీఎం రేవంత్ సభ విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయని సూచిస్తున్నాయి.