Temperatures Falling : పడిపోతున్న టెంపరేచర్స్.. పెరుగుతున్న చలి.. అక్కడ మైనస్ 50 డిగ్రీలు

ఈసారి భాగ్యనగరంలో మరింత తక్కువ టెంపరేచర్(Temperatures Falling) నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Weather

Weather

Temperatures Falling : గత వారం రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టెంపరేచర్స్ సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలను తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కప్పేస్తోంది.

Also Read :Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్‌మెంట్, డీపీఆర్‌‌పై కొత్త అప్‌డేట్

కొన్నిచోట్ల ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు వలయం వీడటం లేదు. దీంతో వాహనదారులు ఉదయం 10 గంటల వరకు లైట్లు  వేసుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. రాత్రి 8 గంటల నుంచి ఉష్ణోగ్రతలు డౌన్ అవుతున్నాయి. ఇటీవలే పటాన్​చెరులో 18.6 డిగ్రీల సెల్సీయస్, హకీంపేట్‌లో 19.9  డిగ్రీల సెల్సీయస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దుండిగల్‌లో 20.4, హైదరాబాద్‌లో 21.3, హయత్​నగర్‌లో​ 21, రాజేంద్రనగర్​‌లో 21 డిగ్రీల సెల్సీయస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు   నమోదయ్యాయి. ‘లా నినా’ ప్రభావంతో రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత తక్కువ టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంటోంది. 2024 జనవరిలో ఒకరోజు హైదరాబాద్​ నగరంలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి భాగ్యనగరంలో మరింత తక్కువ టెంపరేచర్(Temperatures Falling) నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలోనే అతి చల్లని గ్రామం ఇదే..

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న ఒ​మ్యాకోన్ గ్రామ ప్రజలు ఏడాదంతా చలిలోనే గడుపుతున్నారు. ప్రపంచంలో మనుషులు నివసిస్తున్న అతి చల్లని ప్రాంతం ఇదే. ఇక్కడ చలికాలంలో సగటు ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంటుంది. 1924లో ఇక్కడి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా మైనస్ 71.2 డిగ్రీల సెల్సీయస్‌కు డౌన్ అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 500 మంది ఉంటున్నారు.  ఇక్కడివాళ్లు చలిని తట్టుకోవడానికి ‘రుస్కీ’ అనే రష్యన్ టీని రెగ్యులర్​గా తాగుతారు.

  Last Updated: 04 Nov 2024, 10:15 AM IST