Phone Tapping : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజా విచారణలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చేసిన ప్రకటనలు కేసులో కీలక మలుపుకు దారితీశాయి. ట్యాపింగ్ కార్యకలాపాలన్నీ అప్పటి డీజీపీ ఆదేశాలతోనే జరిగాయని ఆయన వెల్లడించడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రభాకర్ రావు మాట్లాడుతూ, “ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరూ నేరుగా నాకు తెలియరు. నేను చేసిన అన్ని చర్యలు నా పై ఉన్న అధికారిగా ఉన్న డీజీపీ చెప్పినట్టే చేశాను” అని స్పష్టం చేశారు. అయితే విచారణలో అడిగిన పలు ప్రశ్నలకు ఆయన “తెలియదు”, “గుర్తులేదు” అనే సమాధానాలు ఇస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారికంగా ధృవీకరించింది.
Health : శుభ్రంగా చేతులు శుభ్రంగా వాష్ చేయకపోతే ఎలాంటి వ్యాధుల బారిన పడతారంటే?
ఇక, 2023 నవంబర్‌లో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పనిచేసిన అధికారులను విచారణకు పిలిచిన సిట్, ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాలను గణాంకాలుగా నమోదు చేసింది. మొత్తం 615 ఫోన్ నంబర్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్టు తేలింది. ఇందులో పలువురు ఐఏఎస్ అధికారులు, పోలీస్ అధికారుల ఫోన్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కేవలం ఉన్నతాధికారులే కాదు, కిందిస్థాయి అధికారులు, ఇతర ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ వ్యవహారం ఎటు తిరుగుతుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో విచారణ మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
10th Fail: తెలుగు రాష్ట్రాల్లో 10, 12 తరగతుల ఫెయిల్యూర్ రేట్లపై కేంద్రం ఆందోళన