New Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26న లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ప్రజలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మార్చి మొదటి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో, మార్చి నెలాఖరులోగా కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా, రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చడం, తొలగించడం వంటి ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది. మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లోనే వార్డు సభలు నిర్వహించాలని అధికారులు భావించినప్పటికీ, ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పూర్తి కాకపోవటంతో ఈ కార్యక్రమం ఆపివేసారు.
Body Pain Relief: వేసవిలో ఈ నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ప్రజాపాలనలో 10,70,659 దరఖాస్తులు అందినాయి, వాటిలో సర్వే ద్వారా అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఈ ప్రక్రియ వందశాతం పూర్తికావటానికి మరో 10 నుండి 12 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో, మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డుల కోసం 83,285 మంది దరఖాస్తు చేసుకోగా, 75వేల మందికి అర్హత లభించింది. అయితే, వార్డు సభలు నిర్వహించకపోవడంతో అర్హుల జాబితా ఇంకా ప్రకటించబడలేదు. ఈ నేపథ్యంలో, మళ్ళీ దరఖాస్తులు చేయాలని తెలిపి, గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో, అర్హుల జాబితాను ప్రకటించకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే రెండు వారాల్లో పూర్తికానుండటంతో, మార్చి మొదటి వారంలో గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డుల లబ్ధిదారులు , ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నగరవాసులు మాత్రం, రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా ఇప్పటికే ఫైనల్ చేయబడినందున, వార్డు సభల కంటే ముందే అర్హుల జాబితా ప్రకటించాలని కోరుతున్నారు.
Delhi New CM: ఢిల్లీకి కొత్త సీఎం.. నేడు బీజేపీ కీలక నిర్ణయం