Site icon HashtagU Telugu

Lab Technicians Jobs : తెలంగాణలో 1,284 ల్యాబ్​ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

Telangana Medical And Health Services Lab Technicians Recruitment

Lab Technicians Jobs : 1284 ల్యాబ్​ టెక్నీషియన్ గ్రేడ్​-II  పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్​ అండ్​ హెల్త్​ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు నోటిఫికేషన్​ రిలీజ్ చేసింది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1284 పోస్టులలో 1088 పోస్టులు డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​/ డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్ విభాగంలో ఉన్నాయి. 183 పోస్టులు  తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఉన్నాయి. 13 పోస్టులు ఎంఎన్​జే ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఆంకాలజీ అండ్​ రీజినల్​ క్యాన్సర్​ సెంటర్​‌లో ఉన్నాయి. ఉద్యోగార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 21న(Lab Technicians Jobs) మొదలైంది. దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబరు 5. అప్లికేషన్లలో సవరణ చేసుకునేందుకు  అక్టోబర్ 7 నుంచి 8 వరకు ఛాన్స్ ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే వారికి నవంబరు 10న పరీక్ష నిర్వహిస్తారు.

Also Read :PM Modi : ప్రధాని మోడీ ‘‘కామ్ కీ బాత్’’ చేయడం లేదు : రాహుల్‌గాంధీ

ఈ పోస్టులకు అప్లై చేసేవారు లేబొరేటరీ టెక్నీషియన్​ కోర్సు/ ఎంఎల్​టీ ఓకేషనల్​/ ఇంటర్మీడియట్​(ఎంఎల్​టీ ఓకేషనల్​)/ బీఎస్సీ(ఎంఎల్​టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్​టీ)/ డీఎంఎల్​టీ/ బీఎంఎల్​టీ/ పీజీడీ ఎంఎల్​టీ/ బీఎస్సీ(మైక్రో బయాలజీ)/ ఎంఎస్సీ(మైక్రో బయాలజీ/ మెడికల్​ బయో కెమిస్ట్రీ/ క్లీనికల్​ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) అర్హతలను కలిగి ఉండాలి. ఈ ఏడాది జులై నాటికి 46 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లై చేయొచ్చు.

Also Read :UPI Transaction Fees : ఛార్జీలు విధిస్తే యూపీఐ లావాదేవీలు చేయబోం.. సర్వేలో సంచలన విషయాలు

ఆన్​లైన్​ పరీక్ష ఫీజు రూ.500 ఉంటుంది. కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​, రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను సమర్పించాలి. హైదరాబాద్​, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తెనపల్లి, కరీంనగర్​, మహబూబ్​నగర్​, సంగారెడ్డి, ఆదిలాబాద్​, నిజామాబాద్​, వరంగల్, నర్సంపేట్​‌లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబరు 5.