Site icon HashtagU Telugu

Indiramma Housing Scheme : గజం పెరిగిన ఇందిరమ్మ సాయం అందదు – తెలంగాణ సర్కార్ హెచ్చరిక

Indiramma Houses Scheme

Indiramma Houses Scheme

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ పథకం(Indiramma Housing Scheme)పై స్పష్టమైన మార్గదర్శకాలను వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మించిన వారికి మాత్రమే ప్రభుత్వ సాయం అందుబాటులో ఉంటుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. ఈ పరిమితిని మించి ఇంటి నిర్మాణం జరిగితే సంబంధిత లబ్ధిదారులు పథకానికి అనర్హులవుతారని స్పష్టం చేశారు.

POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్

రాష్ట్రవ్యాప్తంగా 2,832 మందికి బేస్మెంట్ నిర్మాణం పూర్తయినట్లు గౌతమ్ చెప్పారు. అయితే వీరిలో 285 మంది లబ్ధిదారులు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడిందన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోతే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం నిలిపివేయాల్సి వస్తుందని తెలిపారు.

ఇందిరమ్మ పథకానికి అర్హత పొందాలంటే ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిన అవసరముందని అధికారులు గుర్తు చేశారు. గజం పరిమితి కంటే ఎక్కువగా ఇంటిని నిర్మించడమే కాకుండా, నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగితే కూడా పథకం నుంచి తొలగింపు జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ సహాయాన్ని కొనసాగించుకోవాలంటే అందరు లబ్ధిదారులు నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు.