Revanth Reddy: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు

తెలంగాణలో మరో మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు రానున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించనున్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ గురించి వివరించారు. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెగా గ్రోత్‌ కారిడార్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. తెలంగాణలో కొత్తగా మరికొన్ని నగరాలకు ఔటర్ రింగ్ రోడ్డులు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

Published By: HashtagU Telugu Desk
Cm Revanth

Cm Revanth

తెలంగాణలో మరో మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు రానున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించనున్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ గురించి వివరించారు. రాష్ట్రంలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెగా గ్రోత్‌ కారిడార్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచనలు చేశారు.

తెలంగాణలో కొత్తగా మరికొన్ని నగరాలకు ఔటర్ రింగ్ రోడ్డులు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్‌ల్లో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ కార్పొరేషన్లకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంపై మున్సిపల్‌శాఖకు సూచించారు. రాష్ట్రంలో మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలి. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్‌ను, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు కావాలి. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలి. సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలి. ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, రింగ్ రోడ్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలతో పాటు ఇతర అంశాలన్నీ గ్రోత్ కారిడార్లలో స్పష్టంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి సూచించారు.

తెలంగాణలో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు, పనులు చేపట్టాలి. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారుతాయి. ఆ విమానాశ్రయానికి కావలసిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నారు. గ్రోత్ కారిడార్లలో వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ డిజైన్ చేసి స్పష్టంగా ఉండాలి. నగరాల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలి. లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీ వాహనాలే ఉండాలి. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు ఉండాలి అన్నారు.

మున్సిపాలిటీలలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలి. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలి. నగరాలు, పట్టణాల్లో సమస్యలను పరిష్కరించడానికి, ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి, ఏఐ వినియోగం కోసం సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్లు, ఎస్టీపీలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఈవీ వంటి అంశాల పైన ప్రతిచోటా ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

 

 

  Last Updated: 14 May 2026, 10:36 AM IST