Ratings To Hotels : హోటళ్లు, రెస్టారెంట్లలోని ఆహార నాణ్యతను పెంచడంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలోని ఫుడ్ ఐటమ్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్‌ఏఐ) అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, నాణ్యతను బట్టి వాటికి రేటింగ్స్ ఇవ్వనున్నారు. ఈ రేటింగ్స్ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఆయా హోటళ్లు, రెస్టారెంట్ల లిస్టును ఎఫ్ఎస్ఎస్‌ఏఐ డిస్‌ప్లే చేయనుంది. ఈ ప్రక్రియను తొలుత గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో(Ratings To Hotels) మొదలుపెట్టనున్నారు.
Also Read :Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్.. మూడు గంటల్లోనే అమరావతికి
హైదరాబాద్ పరిధిలో దాదాపు 75 వేల రెస్టారెంట్లు ఉండగా.. 23 మంది మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఈ లెక్కన 3500కుపైగా రెస్టారెంట్లకు ఒకే ఒక అధికారి ఉన్నారు. అందుకే హైదరాబాద్ పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్స్ ఇచ్చే ప్రక్రియ పూర్తికావడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. మరిన్ని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తే తనిఖీలు, రేటింగ్ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంటుంది. ఈమేరకు వివరాలతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒక నివేదికను రెడీ చేస్తున్నారు. త్వరలోనే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనకు పంపనున్నారు. ఆయన నుంచి ఆమోదం లభిస్తే హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది. మరోవైపు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ దిశగానూ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రెండో విడతలో తెలంగాణలోని ఇతర ప్రధాన నగరాలలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు ఎఫ్ఎస్ఎస్‌ఏఐ రేటింగ్స్ ఇవ్వనున్నారు. మూడో విడతలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ ప్రక్రియను విస్తరింపజేస్తారు.