CM KCR : కేసీఆర్ మాయ‌! జై భార‌త్, జై తెలంగాణ క‌నిక‌ట్టు!

తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల్ని మిస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌రు.

  • Written By:
  • Updated On - December 5, 2022 / 04:56 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్ర‌జ‌ల్ని మిస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌రు. ఏది అనుకుంటే, ఆ దిశ‌గా ప్ర‌జ‌ల మైండ్ సెట్ ను మ‌ళ్లించే చ‌తుర‌త ఆయ‌న సొంతం. లెఫ్ట్, రైట్ పార్టీల‌ను రెండు భుజాల‌పై ఎక్కించుకుని రాజ‌కీయం న‌డిపిన చ‌రిత్ర ఆయ‌న‌కు ఉంది. అంతేకాదు, హిందూ,ముస్లిం స‌మాజాన్ని ఏక‌కాలంలో త‌న‌కు మ‌ద్ధ‌తు ఇచ్చేలా చ‌క్రం తిప్పిన నేర్ప‌రి ఆయ‌న‌. ఇప్పుడు జై భార‌త్, జై తెలంగాణ (Telangana) నినాదంతో ఒకేసారి జాతీయ‌, ప్రాంతీయ వాదాన్ని వినిపిస్తూ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న జై భార‌త్, జై తెలంగాణ (Telangana) నినాదాన్ని వినిపిస్తూ ప్ర‌సంగాన్ని ముగించారు. అంటే, తెలంగాణ ఎన్నిక‌ల వ‌ర‌కు జై తెలంగాణ నినాదం. ఆ త‌రువాత లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు జై భార‌త్ స్లోగ‌న్ వినిపించ‌బోతున్నారు. వాస్త‌వంగా ఆయ‌న ప్రాంతీయ వాదాన్ని న‌డిపి రాజ‌కీయాల్లో అగ్ర‌స్థానానికి ఎదిగారు. ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ‌కు కాప‌లా కుక్క‌లా ఉంటాన‌ని చెప్పారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే ఉద్య‌మకాడిని కింద‌ప‌డేశారు. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మాత్ర‌మే టీఆర్ఎస్ ప‌నిచేస్తుంద‌ని సెల‌విచ్చారు. ఆ రోజు నుంచి ఉద్య‌మ‌కారుల‌ను దాదాపుగా గులాబీ పార్టీకి దూరంగా పెట్టారు. ఇత‌ర రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో ఆ పార్టీని నింపేశారు. అయిన‌ప్ప‌టికీ 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు తెలంగాణ ఓట‌ర్లు ప‌ట్టం క‌ట్టారు.

యాగాలు, పూజ‌లు చేస్తూ హిందూవాదిగా ఆ స‌మాజాన్ని ఒక భుజంపై కేసీఆర్ (CM KCR) ఎత్తుకున్నారు. అదే స‌మ‌యంలో ఎంఐఎంను స‌హ‌జ‌మిత్రునిగా ఉంచుకున్నారు. ప‌ర్మినెంట్ గా ఓవైసీని సొంత మ‌నిషిగా మ‌ల‌చుకున్నారు. ఆ పార్టీ కేసీఆర్ ఏది చెబితే ఆ విధంగా న‌డిచేలా చాక‌చ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఫ‌లితంగా ముస్లిం స‌మాజాన్ని కేసీఆర్ మ‌రో భుజం మీద పెట్టుకున్నారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రూపంలో స‌మైక్య‌వాదుల్లోని `రెడ్డి` సామాజిక‌వ‌ర్గాన్ని ఆక‌ట్టుకున్నారు. ఇంకో వైపు `క‌మ్మ‌` సామాజిక‌వ‌ర్గానికి ఐదు ఎక‌రాల భూమిని హైటెక్స్ స‌మీపంలో కేటాయిస్తూ వాళ్ల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ విగ్ర‌హానికి, ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు వెళుతూ నివాళులు అర్పించేందుకు గులాబీ శ్రేణులను పంప‌డం ద్వారా క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని సంతృప్తి ప‌రుస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా సోషల్ ఇంజ‌నీరింగ్ ను న‌మ్ముకున్న కేసీఆర్ కు సెంటిమెంట్ కూడా గ‌త రెండు ఎన్నిక‌ల్లో క‌లిసి వ‌చ్చింది. ఇప్పుడు ప్ర‌త్యేక‌వాదాన్ని ప‌క్క‌న‌పెడుతూ స‌మైక్య‌వాదాన్ని అందుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశ వ్యాప్తంగా రాజ‌కీయం చేయ‌డానికి సిద్ధం అయ్యారు. అయితే, రాష్ట్రంలో న‌ష్ట‌పోకుండా ప్ర‌త్యేక‌వాదం సెంటిమెంట్ ను రగిలిస్తున్నారు. ఆ దిశ‌గా గులాబీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకోసం ష‌ర్మిల పాద‌యాత్ర‌ను రాజ‌కీయంగా వాడుకోవ‌డానికి స్కెచ్ వేశారు. ఆమె పాద‌యాత్ర మ‌రికొద్ది రోజుల్లోనే ముగియ‌నుంది. ఆ లోపుగా వీలున్నంత ఆంధ్రా సెంటిమెంట్ వేడిని ర‌గిలించాలని కారు పార్టీ కాక‌మీద ఉంది. అంటే, రాష్ట్రంలో ఆంధ్రా సెంటిమెంట్ దేశంలో భార‌త్ సెంటిమెంట్ ను కేసీఆర్ న‌మ్ముకున్నార‌న్న‌మాట‌. ఆ రెండు ర‌కాల సెంటిమెంట్ల‌ను స‌మాంత‌రంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ‌తారు అనేది ఆస‌క్తిక‌రం.

Also Read:  YS Jagan : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ద‌డ