Telangana Cabinet Meeting: ఈరోజు మధ్యహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. అయితే మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలిని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణ మాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాక ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరిని కేబినెట్ సమావేశానికి పిలువొద్దని సూచించింది. అయితే ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, జూన్ నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రణాళిక వంటి అంశాలకే కేబినెట్ పరిమితం కానుంది.
Read Also: Salaar 2 : ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగష్టులో అంటే.. సలార్ 2 ఇప్పటిలో లేనట్లేనా..?
మరోవైపు శనివారమే మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతిని కోరింది. ఆ రోజు రాత్రి వరకు పర్మిషన్ రాకపోవడంతో భేటీ వాయిదా పడింది. ఒకవేళ అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కానీ షరతులతో కూడిన పర్మిషన్ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈసీ షరతులను దృష్టిలో పెట్టుకుని, కొత్త అజెండాతో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.