Cabinet Expansion: ఉగాది (మార్చి 30)కల్లా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్తగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ రేసులో వాకిటి శ్రీహరి(మక్తల్ ఎమ్మెల్యే), సుదర్శన్ రెడ్డి(బోధన్ ఎమ్మెల్యే) పేర్లు ముందంజలో ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు ఎమ్మెల్యే), గడ్డం వివేక్ వెంకటస్వామి(చెన్నూర్ ఎమ్మెల్యే) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మీర్ అమీర్ అలీఖాన్, విజయశాంతిలకూ మంత్రి పదవులు దక్కుతాయనే టాక్ వినిపిస్తున్నప్పటికీ, ఆ అవకాశాలు కనిపించడం లేదు. మరో రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేయనున్నారు. అయితే వాటిని ఎవరికి కేటాయించాలనే దానిపై ఇంకా కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించలేదు. అందుకే వాటి భర్తీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు.
Also Read :Kandi Pappu : కందిపప్పుతో లాభాలే కాదు సమస్యలు కూడా వస్తాయి..అవి ఏంటో తెలుసా..?
విజయశాంతికి మంత్రి పదవి
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనున్న పలు శాఖలను కొత్త మంత్రులకు(Cabinet Expansion) కేటాయించే అవకాశం ఉంది. సీఎం వద్దనున్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్ మంత్రులకు ఇస్తారట. ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారి శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరికి ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి తగిన ఆధారాలేవీ లేవు. వరుస వివాదాల్లో నిలిచిన కారణంతోనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని అంటున్నారు. ఒకవేళ ఈ ఇద్దరు మంత్రులను తొలగిస్తే.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మీర్ అమీర్ అలీఖాన్, విజయశాంతిలలో కనీసం ఇద్దరి బెర్త్‌లు దక్కే ఛాన్స్ ఉంటుంది.
Also Read :Yawning : మీకు ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా..? అయితే మీకు వచ్చే ప్రమాదం ఇదే !
ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్
మంత్రివర్గంలో ఎస్టీకి అవకాశం కల్పించాలనే పక్షంలో, ఆ వర్గం ఎమ్మెల్యేను డిప్యూటీ స్పీకర్‌గా చేయనున్నారు. ఇక త్వరలోనే తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా వెలువడనుంది. తొలి విడతలో నలుగురు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, 20 మందికిపైగా వైస్ ప్రెసిడెంట్‌లను ప్రకటించనున్నారు. కొన్ని నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తారు.