Site icon HashtagU Telugu

TCongress: నాయకత్వ లేమితో బీజేపీ బేజార్, కీలక నేతల చూపు కాంగ్రెస్ వైపు!

Rajagopal Reddy

Rajagopal Reddy

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఓడించేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం ఇటీవల తేల్చి చెప్పింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు తెలంగాణలో బిజెపి పూర్తిగా గందరగోళంలో పడింది. ‘‘కేసీఆర్‌ను ఓడించాలన్న లక్ష్యం పూర్తిగా లేకపోవడంతో నాయకత్వ లేమితో నిరుత్సాహానికి గురవుతున్నాం అని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ స్టేట్ మెంట్ తో రాజగోపాల రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీకి ఇకపై ఈ (సీఎంను ఓడించే) పరిస్థితి లేదనే భావన కిందిస్థాయి నేతల్లో నెలకొనడం గమనార్హం.

రాజ్‌గోపాల్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీలు విజయశాంతి, జి. వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ కూడా ఒకింత నిరాశతో ఉన్నట్టు సమాచారం. మరో 25 మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టడమే ఇప్పుడు పార్టీని కాపాడే ఏకైక మార్గం రాజ్‌గోపాల్ రెడ్డి అనేక సార్లు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవితపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీకి చేటు తెచ్చిపెట్టిందని, అధ్యక్ష బాధ్యతల నుంచి బండిని తప్పంచడం కూడా పెద్ద మైనస్ గా మారిందని రాజగోపాల్ రెడ్డితో ఇతర నాయకులు భావిస్తున్నారు.

గతంలో బిజెపికి 65 శాతం అధికార వ్యతిరేక ఓటు ఉంది. కాంగ్రెస్ దూకుడుతో బీజేపీ ఓటింగ్ తగ్గబోతుందని నేతలు భవిస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో చాలా అసంతృప్తి ఉందని స్వయంగా నేతలు అంగీకరిస్తున్నారని కిందిస్థాయి నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుంటే బీజేపీ నేతల్లో అయోమయం నెలకొనడం చర్చనీయాంశమవుతుంది.

Also Read: Harish Rao: గవర్నర్‌ గారు..ఇదేం పద్దతి? : మంత్రి హరీశ్ రావు