Top 10 Non Veg States : తాజాగా నిర్వహించిన నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(NHFS-5)లో పలు ఆసక్తికర అంశాలు బయటికి వచ్చాయి. మన దేశంలో ఎక్కువ మంది మాంసాహారులు ఉన్న రాష్ట్రాల జాబితా కూడా బయటికి వచ్చింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం..
Also Read :Harish Kumar Gupta : ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా.. చంద్రబాబు రాగానే కీలక ప్రకటన
సర్వే నివేదికలోని అంశాలివీ..
- మాంసాహారం తినే విషయంలో మన దేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం నాగాలాండ్(Top 10 Non Veg States). ఈ రాష్ట్రంలో 99.8 శాతం మంది మాంసాహారులే.
- ఈ కేటగిరీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 99.3 శాతం మంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు.
- మాంసాహారం వినియోగంలో మూడో స్థానంలో కేరళ ఉంది. ఈ రాష్ట్రంలో 99.1 శాతం మంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు. కేరళీయులకు సీఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం.
- 98.25 శాతం మంది మాంసాహార ప్రియులతో ఏపీ నాలుగో స్థానంలో ఉంది.
- 97.65 శాతం మంది నాన్ వెజ్ లవర్స్‌తో తమిళనాడు ఐదో స్థానంలో ఉంది.
- 97.35 శాతం మంది మాంసాహార ప్రియులతో ఒడిశా ఆరో స్థానంలో ఉంది. ఇక్కడి వారికి రొయ్యల వంటకాలు అంటే ఎక్కువ ఇష్టం.
- 97.3 శాతం మంది నాన్ వెజ్ లవర్స్‌తో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. తెలంగాణలో ప్రజలకు మటన్, చికెన్, ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం.
- 97 శాతం మంది మాంసాహార ప్రియులతో జార్ఖండ్ 8వ స్థానంలో ఉంది.
- త్రిపురలో 95 శాతం మందికి, గోవాలో 93.8 శాతం మందికి నాన్ వెజ్ అంటే ఇష్టం.
Also Read :Saif Ali Khan : సైఫ్ పై నిజంగా దాడి జరిగిందా..? మంత్రి నితీష్ రాణే కీలక వ్యాఖ్యలు
తెలంగాణను దాటేసిన ఏపీ
కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతక్రితం నిర్వహించిన నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(NHFS-5)లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే తాజా సర్వేలో తెలంగాణ ర్యాంకు 7కు డౌన్ అయింది. నాన్ వెజ్ లవర్స్ విషయంలో ఏపీ కూడా తెలంగాణను దాటేసింది. తెలంగాణలో మాంసం ధరలు భారీగా పెరిగాయి. దీనికితోడు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు పెరిగాయి. అక్కడ నాణ్యతలేని మాంసాహారం అమ్ముతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో హోటళ్లలో ఫుడ్ తినే వారి సంఖ్య తగ్గింది. ఈ ఎఫెక్టులతో తెలంగాణలో మాంసాహారం వినియోగం చాలావరకు తగ్గిందని అంటున్నారు.