Kedar Selagamsetty : టాలీవుడ్ నిర్మాత కేదార్ (Tollywood producer Kedar Selgamsetty) అనుమానాస్పదంగా మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దుబాయ్‌లో ఆయన మరణించడంతో ఇది సహజ మరణమా, లేక హత్యా అనే ప్రశ్నలు అందరిలో పెరుగుతున్నాయి. సాధారణంగా దుబాయ్‌లో అనుమానాస్పద మరణాలు సంభవించినప్పుడు అక్కడి పోలీసులు కేసు తేలేదాకా పూర్తి వివరాలను బయట పెట్టరు. కేదార్ విషయంలో కూడా అదే జరుగుతోంది. గుండెపోటుతో మరణించారని చెబుతున్నా, అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయినా, ఆయన బంధువులకు అప్పగించకపోవడం, మరణానికి గల కారణాలను వెల్లడించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
Porn Sites Vs Bank Accounts: అశ్లీల సైట్ల పేరుతో స్కామ్.. బ్యాంకు అకౌంట్లు గుల్ల
కేదార్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడం తో సంచలనంగా మారింది. కేదార్ టాలీవుడ్‌లో పెద్ద నిర్మాత కాకపోయినా, వివాదాస్పద డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దుబాయ్‌లో మరణించడం, ఆయన చుట్టూ ఉన్న రాజకీయ మరియు వ్యాపార సంబంధాల కారణంగా ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్య, ఆ కేసును వాదించిన సంజీవ రెడ్డి అనుమానాస్పద మృతి, ఈ మూడు మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Posani : ఛాతి నొప్పి అని పోసాని డ్రామా : సీఐ వెంకటేశ్వర్లు
కేదార్ మృతి రోజున జరిగిన ఘటనలు కూడా గందరగోళాన్ని పెంచుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ వీక్షించడంతో పాటు సినీ ప్రముఖులతో విందులో పాల్గొన్న తర్వాత, తన పని మనిషికి ఫోన్ ఇచ్చి నిద్రపోయిన కేదార్, ఉదయాన్నే విగతజీవిగా కనిపించడం అనుమానాస్పదంగా మారింది. అతని ఇంటికి వచ్చిన దుబాయ్ పోలీసులు, అక్కడున్న నలుగురిని విచారించారు. వారిలో ఒకరు తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే అని తెలుస్తోంది. అయితే ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? కేదార్ మరణానికి వారితో ఎలాంటి సంబంధం ఉందనే అంశాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దుబాయ్ పోలీసులు పూర్తి విచారణ జరిపే వరకు కేదార్ మరణంపై స్పష్టత రాకపోవచ్చు. కానీ ఈ ఘటన రాజకీయ మరియు సినీ రంగాల్లో కలకలం రేపింది.