Slogans War : బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు జరుగుతోందా ? కేటీఆర్, కవిత వర్గాలు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నాయా ? అంటే.. ఇటీవలే ఆ పార్టీలో చోటుచేసుకున్న పలు పరిణామాలు ఆ దిశగానే సిగ్నల్స్ ఇస్తున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఆ పరిణామాలేంటి .. వాటి సిగ్నల్స్ ఏమిటి అనేది ఈ కథనంలో చూద్దాం..
Also Read :T Congress Incharge : టీ కాంగ్రెస్‌కు కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !
‘‘కవిత సీఎం.. కవిత సీఎం’’
ఇటీవలే నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమె సమావేశానికి హాజరైన పలువురు బీఆర్ఎస్ నాయకులు ‘‘కవిత సీఎం.. కవిత సీఎం’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్‌పై విడుదలై తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన టైంలోనూ హైదరాబాద్ విమానాశ్రయంలో పలువురు బీఆర్ఎస్ నేతలు అవే నినాదాలు చేశారు. కాబోయే సీఎం కవిత అని అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.
‘‘కేటీఆర్ సీఎం.. కేటీఆర్ సీఎం’’
తాజాగా ఇవాళ తెలంగాణ భవన్‌లో 2025 సంవత్సర క్యాలెండర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రాంలో ‘‘కేటీఆర్ సీఎం.. కేటీఆర్ సీఎం’’ అంటూ పలువురు బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.
Also Read :New Pamban Bridge : పాంబన్ వంతెన రెడీ.. బోల్టు నుంచి లిఫ్ట్ దాకా అబ్బురపరిచే విశేషాలు
కేసీఆర్ స్పందిస్తే..
పైన చెప్పుకున్న రెండు పరిణామాలు.. బీఆర్ఎస్‌లో వర్గాలు ఏర్పడ్డాయి అనేందుకు సిగ్నల్స్(Slogans War) లాంటివని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటిదాకా సీఎం అభ్యర్థి అంటే కేసీఆర్ ఒక్కరే కనిపించారు. కానీ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే సీన్ మారింది. ఇప్పుడు ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరంటే మూడు పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌పై పట్టు కోసం కేటీఆర్, కవిత మధ్య నెలకొన్న పోటీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ఇప్పటికైనా కలగజేసుకొని ఈ పోటీని ఆపకుంటే.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల బీజేపీ లబ్ధి పొందే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలనే చూసుకుంటే.. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న చాలా చోట్ల బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. భవిష్యత్తులో ఆ సీన్ రిపీట్ కావొద్దంటే.. కారు పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలను సత్వరం మొదలుపెట్టాలి.