Site icon HashtagU Telugu

Rs 2500 Per Month : త్వరలోనే మహిళలకు ప్రతినెలా రూ.2500

Telangana Women 2500 Per Month

Rs 2500 Per Month : మహిళల అకౌంట్లలో ప్రతినెలా రూ.2500 జమ చేసేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి స్కీంను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందుకోసం మార్గదర్శకాలను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ఆగస్టు నెలలో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. దాన్ని మహిళలు(Telangana Women) శుభప్రదమైన మాసంగా  భావిస్తారు. అందుకే వచ్చే నెలలో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రతినెలా రూ.2,500(Rs 2500 Per Month) అందించనున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రతినెలా పింఛను పొందుతున్న కుటుంబాలను ఈ స్కీం నుంచి మినహాయించే అవకాశం ఉంది. ఈమేరకు మహాలక్ష్మి పథకం లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని హైదరాబాద్‌కు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Also Read :Rahul – Revanth : ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్‌గాంధీ : సీఎం రేవంత్

ఇప్పటికే తెలంగాణలో రూ.500కే వంటగ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు వంటి పథకాలు అమల్లోకి వచ్చాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళాశక్తి అనే పథకాన్ని కూడా రేవంత్ సర్కారు అమలు చేయబోతోంది.  ఈ పథకం కింద పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు స్వయం సహాయక సంఘాలకు లోన్లు ఇవ్వనున్నారు. బ్యాంకులు, స్త్రీనిధి మండల మహిళా సమాఖ్య ద్వారా ఈ లోన్లు ఇస్తారు.  ఈ పథకం కింద మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించి యూనిట్లను మంజూరు చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మహిళా శక్తి పథకంలో భాగంగా పాడి పశువుల పెంచాలని భావించే వారికి ప్రతి జిల్లాకు రూ.4.5 కోట్లు చొప్పున 500 మంది మహిళా సమాఖ్యల సభ్యురాళ్లకు యూనిట్లను మంజూరు చేయనున్నారు. రూ.90 వేల ఆర్థిక సహాయంతో ఒకటి లేదా రెండు పశువులను ఒక్కో సభ్యురాలికి అందిస్తారు.

Also Read :Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం