Sharmila in Congress : కాంగ్రెస్ లో ష‌ర్మిల చేరిక‌పై `బైబిల్` బ్రేక్?

Sharmila in Congress : కాంగ్రెస్ పార్టీలోకి ష‌ర్మిల చేరిక తాత్కాలికంగా నిలిచిపోయిందా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చ‌క్రం ఎలా తిప్పారు?

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 02:43 PM IST

Sharmila in Congress : కాంగ్రెస్ పార్టీలోకి ష‌ర్మిల చేరిక తాత్కాలికంగా నిలిచిపోయిందా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చ‌క్రం ఎలా తిప్పారు? ఆస్తుల పంప‌కంపై క్లారిటీ వ‌చ్చేసిందా? తాడేప‌ల్లి కోట‌లో ఏమి జ‌రిగింది? బైబిల్ ఎపిసోడ్ తో అంతా స‌ద్దుమ‌ణిగిందా? ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా జ‌రుగుతోన్న చ‌ర్చ‌. త‌ల్లి విజ‌య‌మ్మ ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పంపిన సందేశం ష‌ర్మిల‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర‌కుండా తాత్కాలికంగా నిలిపివేసింద‌ట‌. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతోగానీ తెలంగాణ కాంగ్రెస్ లోని ఒక వ‌ర్గం ఊపిరి పీల్చుకుంది.

ష‌ర్మిల‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర‌కుండా తాత్కాలికంగా ..(Sharmila in Congress)

షెడ్యూల్ ప్ర‌కారం శ‌నివారం సాయంత్రం సోనియా, రాహుల్ స‌మ‌క్షంలో ష‌ర్మిల కాంగ్రెస్  (Sharmila in Congress) పార్టీలో చేరాలి. అంతేకాదు, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ విలీనం క‌థ ముగించాలి. గ‌త నెల రోజులుగా జ‌రిగిన చ‌ర్చ‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డాలి. బెంగుళూరు కేంద్రంగా జ‌రిగిన డీకే శివ‌కుమార్ ఆప‌రేష‌న్ క్లోజ్ కావాలి. రాజ‌కీయ వ్యూహ‌కర్త సునీల్ కనుగోలు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించాలి. కానీ, ఆక‌స్మాత్తు సీన్ మారింది. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంద‌నేలా ష‌ర్మిల చేరిక ఆగింద‌ని ప్ర‌చారం మొద‌ల‌యింది.

ష‌ర్మిలతో రాజీ మార్గాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంచుకున్నార‌ని

వాస్తవంగా ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక (Sharmila in Congress)చ‌ర్చ‌లు ముగింపుకు వ‌చ్చాయి. ఆమె పార్టీని విలీనం చేయ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కీల‌కం కావ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఒక వేళ అదే జ‌రిగితే, రాబోవు రోజుల్లో తెలంగాణ వ‌ర‌కు ష‌ర్మిలను కాంగ్రెస్ ప‌రిమితం కానివ్వ‌దు. ఏపీలోకి ఎంట్రీ ఇస్తే, వ‌చ్చే న‌ష్టాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్ర‌హించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రకు జ‌రిగిన ఎపిసోడ్ ను గ‌మ‌నించిన ఆయ‌న తాజా స‌ర్వేల‌తో రాజీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, త‌ల్లి విజ‌య‌మ్మ ద్వారా రాయ‌బారం పంపిన‌ట్టు ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియా ప్ర‌చారం చేస్తోంది. అంతేకాదు, బైబిల్ మీద ఒట్టు వేసి చెప్ప‌డంతో జ‌గ‌న్ మాట‌ను న‌మ్మిన‌ విజ‌య‌మ్మ రాయభారాన్ని న‌డిపార‌ని చెబుతోంది.

ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక చ‌ర్చ‌లు ముగింపు

ఫంక్ష‌న్లో ఉన్న ష‌ర్మిల‌, బ్ర‌ద‌ర్ అనిల్ కు విజ‌య‌మ్మ ఫోన్ చేశార‌ని తెలిసింది. అత్య‌వ‌స‌రంగా మాట్లాడాల‌ని ఆ ఫోన్ సందేశ‌మ‌ట‌. ఆ ఫంక్ష‌న్ నుంచి హ‌డావుడిగా విజ‌య‌మ్మ వ‌ద్ద‌కు బ్ర‌ద‌ర్ అనిల్, ష‌ర్మిల వెళ్లార‌ని తెలుస్తోంది. కొన్ని గంట‌ల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి చేర‌డానికి సిద్ద‌మైన ష‌ర్మిలను ఏదోలా ఆప‌డానికి ఒప్పించాల‌ని విజ‌య‌మ్మ ప్ర‌య‌త్నించార‌ని తెలిసింది. ఆస్తులను పంచి ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పంపిన సందేశాన్ని విజ‌య‌మ్మ వినిపించార‌ట‌. కానీ, ష‌ర్మిల న‌మ్మ‌క‌పోవ‌డంతో బైబిల్ మీద ఒట్టేసి చెప్పాడ‌ని విజ‌య‌మ్మ చెప్ప‌డం కొంత పున‌రాలోచ‌న‌లో ష‌ర్మిల ప‌డ్డార‌ని  (Sharmila in Congress) లోట‌స్ పాండ్ వ‌ర్గాల వినికిడి.

Also Read : Telangana Congress : తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ..

ఆస్తుల పంప‌కంలో తేడా రావ‌డంతోనే ష‌ర్మిల సొంత రాజ‌కీయ కుంప‌టి పెట్టుకున్నారు. అన్న‌ను కాద‌ని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టారు. తొలి రోజుల్లోనే ఆమె పార్టీని తెలంగాణ‌లో పెట్ట‌డంపై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అన్న మీద కోపమైతే, ఏపీలో పార్టీ పెట్టుకోవాల‌ని తెలంగాణ‌లోని ప్రతినిధులు కొంద‌రు సూచించారు. మెట్టినిల్లుగా తెలంగాణ ఇంపార్టెంట్ అంటూ ష‌ర్మిల వైఎస్సాఆర్ పేరుతో పార్టీని పెట్టారు. పాద‌యాత్ర చేసిన ఆమె ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌భావాన్ని చూప‌గ‌లిగారు. ఆ మేర‌కు సునీల్ క‌నుగోలు స‌ర్వేల్లోనూ తేలింద‌ట‌. అందుకే, ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల‌ని ప్ర‌తిపాదించార‌ని తెలుస్తోంది.

Also Read : Telangana Liberation Day : ఇది ఎన్నికల సమయం..అందుకే అన్ని పార్టీలకు తెలంగాణ విమోచన దినోత్సవం గుర్తుకొస్తుంది

ఒక వేళ కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల చేరితే, రాబోవు ఎన్నిక‌ల్లో ఆమెను ఏపీలోనూ ప్ర‌చారం చేస్తారు. అప్పుడు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం ఉంటుంద‌ని స‌ర్వేల సారాంశం. పైగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశ్వ‌స‌నీయ‌త‌పై చెర‌గ‌ని ముద్ర‌ప‌డుతుంది. అందుకే, మ‌రో ఛాన్స్ కోసం ష‌ర్మిలతో రాజీ మార్గాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే బైబిల్ మీద ఒట్టేసి ఆస్తుల‌ను పంచిపెడ‌తాన‌ని ప్ర‌మాణం చేశార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో అన్న‌, చెల్లెలు మ‌ధ్య రాజీ చేయాల‌ని విజ‌య‌మ్మ రంగంలోకి దిగార‌ని స‌మాచారం. అదే నిజ‌మైతే, కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల చేర‌డం తాత్కాలికంగా వాయిదా ప‌డిన‌ట్టే!