TGSRTC strike : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగకూడదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆర్టీసీ slowly but surely కోలుకుంటోందని, సంస్థ గతంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో సమ్మె చేయడం సమంజసం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. సోమవారం మంత్రి క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిసి, కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు, వైద్య సౌకర్యాలు తదితర అంశాలపై వారు మంత్రి దృష్టిని ఆకర్షించారు.
Read Also: Kadambari Jatwani case : నేడు సీఐడీ ఎదుటకు ఆ ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “టీజీఎస్ ఆర్టీసీ గత 16 నెలల్లో అనేక పాజిటివ్ మార్పులను చూశింది. కార్మికుల మేలు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. కార్మికులపై భారం మోపే విధంగా ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు. మీ సమస్యలు విన్నవే, అయితే వాటి పరిష్కారం కోసం సమ్మె అవసరమా?” అని ప్రశ్నించారు. ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా తమ సమస్యలు నేరుగా తనతోను, లేదా ముఖ్యమంత్రి కార్యాలయంతోనైనా చర్చించవచ్చని తెలిపారు. “నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. మీరు నేడు, రేపు, ఎప్పుడైనా వచ్చినా మీ మాటలు వినేందుకు సిద్ధంగా ఉన్నా. సమ్మె చేసి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకుండా సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుందాం ” అని మంత్రి హామీ ఇచ్చారు.
మున్ముందు కార్మిక సంక్షేమం దృష్ట్యా మరిన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కార్మికులు, యాజమాన్యం మధ్య మౌలిక అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమ్మె యత్నాలు ప్రజలకే కాకుండా సంస్థ పునరుద్ధరణకు అడ్డంకి అవుతాయని మంత్రి హెచ్చరించారు. ఆర్టీసీని పునరుత్థాన దిశగా తీసుకెళ్లేందుకు కార్మికుల సహకారం ఎంతో అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ మేరకు కార్మిక నేతలు మంత్రి భరోసా పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సమస్యలపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని కోరారు.
కాగా, గత 10 ఏళ్లుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారని, ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని ఆరోపించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ. 345 కోట్లు రూపాయలు చెల్లించామన్నారు. దాదాపు 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగ పెండింగ్‌లో ఉన్న రూ.1039 కోట్లు చెల్లించామన్నారు. నెలవారీ పీఎఫ్, సీసీఎస్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదని, సీసీఎస్, పీఎఫ్ పైసలు వాడుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించిందన్నారు. 2017 పే స్కేల్ 21% శాతం ఇవ్వడంతో సంవత్సరానికి రూ. 412 కోట్ల భారం పడుతుందని తెలిపారు.
Read Also: Samantha : సమంత వెకేషన్ల వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?