Site icon HashtagU Telugu

Suicide Letters : బిల్డర్‌ వేణుగోపాల్‌రెడ్డి సూసైడ్ లెటర్స్.. సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఏముందంటే..

Real Estate Builder Mutyala Venugopal Reddy Suicide Letters Cm Revanth Reddy Telangana Dig

Suicide Letters :  మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కొంపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ బిల్డర్‌ ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి జనవరి 29న సూసైడ్ చేసుకున్నాడు. ఆ రోజున బలవన్మరణానికి పాల్పడే ముందు రాసిన ఎనిమిది లేఖల్లో పలు కీలక అంశాలను వేణుగోపాల్‌రెడ్డి ప్రస్తావించాడు. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ మహా నగరం పరిధిలో రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంపై ఎలాంటి ప్రభావం పడిందనేది ఆ లేఖల్లో రాశారు.  ఈ లేఖలను సీఎం రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, తెలంగాణ డీఐజీ, తన కుటుంబ సభ్యులు ఇలా మొత్తం 8 లేఖలను వేణుగోపాల్‌రెడ్డి రాశాడు. ఆ లేఖల్లో ఏముందో చూద్దాం..

Also Read :MLAs Secret Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై రాద్ధాంతం.. బీజేపీ, బీఆర్ఎస్‌ కుట్ర ?

సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో ఇలా..

‘‘రేవంత్‌రెడ్డి(Suicide Letters) గారూ.. మీరంటే చాలా గౌరవం. ఓటేసినవారిలో నేనూ ఒకడినండి. మీరు గెలిచారంటే చాలా సంతోషపడ్డాను. హైడ్రా తీసుకువచ్చారు. హైడ్రా వల్ల ఎంత మంది నష్టపోతున్నారో మీరు చూసుకోలేకపోయారు. మీరు ఒక ప్రోగాం స్టార్ట్‌ చేశారు.. మంచిదే, చెడ్డదని నేను అంటలేను. కానీ, మాలాంటి చిన్న బిల్డర్ల పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించారా? మేమెలా పైకి వస్తామనుకున్నారు? నా చావుకు మీరు కూడా ఒక కారణం’’  అని లేఖలో రియల్ ఎస్టేట్ బిల్డర్‌ ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి రాశాడు.

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు రాసిన లేఖలో..

మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు రాసిన లేఖలో.. ‘‘నేను మీ నియోజకవర్గానికి చెందినవాడిని. మీకు ఓటేసే వాడిలో నేనూ ఒకడిని. మా అమ్మానాన్నలకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. వాళ్లకు కొంచెం మీరు సాయం చేయండి. నేను మధ్యలో ఆపేసిన బిల్డింగ్‌ నిర్మాణ పనులు మళ్లీ స్టార్ట్‌ అయ్యేలా చూడండి’’ అని ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నాడు.

డీఐజీకి రాసిన లేఖలో..

‘‘అతి కష్టం మీద మేం బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటం. వేధింపుల వల్ల మాలాంటి వాళ్లు కష్టాల నుంచి బయటపడట్లేదు. నేను ఈరోజు చచ్చిపోతున్నా. నాలాంటి వాళ్లు ఇంకా ఎంతోమంది ఉన్నరు. వాళ్లనైనా ఆదుకోండి’’ అని డీఐజీకి లేఖ రాసిన లేఖలో ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నాడు.

Also Read :Budget 2025 : కోటి మందికి ఊరట కల్పించిన నిర్మలా సీతారామన్