Raja Singh Strong Warning : మోసం చేస్తే చంపేస్తానంటూ రాజాసింగ్ వార్నింగ్

తనను మోసం చేస్తే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని హెచ్చరించారు. అంతేకాదు.. చంపేందుకు కూడా వెనుకాడబోనంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు

Published By: HashtagU Telugu Desk
Rajasingh

Rajasingh

సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ (Rajasingh). ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో రాజాసింగ్ ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు ప్రచారం చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తన ప్రచారంలో(Election Campaign) మాట్లాడుతూ..సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎవర్ని నమ్మకూడదు..అప్పటి వరకు మనతోనే ఉన్న వారు..టైంకు పక్క పార్టీలో చేరతారు. అలాగే మానపక్కనే తిరుగుతూ..మన వ్యూహాలను పక్క పార్టీ నేతలకు చేరవేస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రాజాసింగ్ విషయంలో కూడా అలాగే చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించిన ఎన్నికలని.. తనను మోసం చేస్తే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని హెచ్చరించారు. అంతేకాదు.. చంపేందుకు కూడా వెనుకాడబోనంటూ గట్టి వార్నింగ్ (Raja Singh Strong Warning BJP Activists) ఇచ్చారు. తన వ్యూహాలను సొంత మనుషులే తన ప్రత్యర్థులకు చేరవేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారి అంతు చూస్తానంటూ తెలిపారు. 2018 లోనూ తనను ఓడించటానికి ప్రయత్నించిన వారి లిస్ట్ తన వద్ద ఉందన్నారు. ఇప్పుడు ఎవరెవరు తన ప్రత్యర్థులతో టచ్‌లో ఉన్నారో కూడా తెలుసునని, వారి సంగతి తరువాత చూసుకుంటానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also : MLC Kavitha: గులాబీల జెండలే రామక్క పాటకు కవిత స్టెప్పులు, వీడియో చూశారా!

  Last Updated: 16 Nov 2023, 01:34 PM IST