Site icon HashtagU Telugu

Rahul Gandhi: వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్: రాహుల్ గాంధీ

Congress Rahul Khammam

Congress Rahul Khammam

Rahul Gandhi: ఖమ్మం జనగర్జన సభలో అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ… భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని జోడించే ప్రయత్నం చేశాను. దేశమంతా జోడో యాత్రను సమర్ధించింది. తెలంగాణాలో కెసిఆర్ రాజుగా పాలిస్తున్నాడు. ఇందిరాగాంధీ పంపిణీ చేసిన భూముల్ని కెసిఆర్ లాక్కున్నారు. కెసిఆర్ బీజేపీకి బంధువులా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి. బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.

ప్రజలు ఒకటి భావిస్తే బీఆర్ఎస్ మరొకలా పాలిస్తుంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా కెసిఆర్ దాన్ని సమర్ధిస్తూ వచ్చాడు. ఎందుకంటే కెసిఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతుల్లో ఉంది. మిషన్ కాకతీయ పేరుతో కెసిఆర్ భారీగా దోచుకున్నాడు.సమాజంలో ప్రతి రంగంలో దోపిడీ జరిగింది. వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ ప్రకటించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదివాసులకు పోడు భూములు మొత్తం వారికి పంపిణీ చేస్తాము.

Read More: Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు హైద‌రాబాద్ నుంచి ముడుపులు.. జైలు నుంచి సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రో లేఖ