Site icon HashtagU Telugu

Phone Tapping Case: బీఎల్ సంతోష్‌ను అడ్డంపెట్టుకొని కవితను తప్పించే ప్లాన్.. రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్‌

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు తన కన్ఫెషన్  స్టేట్మెంట్‌లో కీలక వివరాలను వెల్లడించారు. మొయినాబాద్‌లో ఉన్న ఫాం హౌస్ కేంద్రంగా పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ యత్నించిందని ఆయన తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

పలువురు మధ్యవర్తులు, కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్(Phone Tapping Case) చేయడం వల్ల ఈవివరాలను తాము ముందుగానే గుర్తించామని రాధాకిషన్‌రావు చెప్పారు. ఈవివరాలను నాటి సీఎం కేసీఆర్‌కు తెలియజేయగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం జరిగే ఆ చర్చల ఘట్టాన్ని రికార్డు చేసేందుకు పెద్దఎత్తున నిఘా పరికరాలను కొనాలని ఆదేశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.   దీంతో వెంటనే తాము అధునాతన స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను  ఢిల్లీ నుంచి కొనుగోలు చేసి రోహిత్ రెడ్డి సహకారంతో ఫాం హౌస్‌లో వాటిని అమర్చామన్నారు.

Also Read :Actress Hema : రేవ్ పార్టీ కేసు విచారణకు హేమ డుమ్మా.. వైరల్‌ ఫీవర్‌ ఉందంటూ లేఖ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో తమకు ఆదేశాలు జారీ చేశారని రాధాకిషన్‌రావు వెల్లడించారు. బీఎల్ సంతోష్‌ను అడ్డం పెట్టుకుని లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని కేసీఆర్ ప్లాన్ వేసినట్లు తెలిసిందన్నారు. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆనాడు కేసీఆర్ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Also Read :Doctors Arrest : ర్యాష్ డ్రైవింగ్ కేసు.. బాలుడి బ్లడ్‌ శాంపిల్​ను మార్చేసిన డాక్టర్లు అరెస్ట్