Site icon HashtagU Telugu

QR code : ఇక పై తెలంగాణ ఆర్‌టీసీ బస్సుల్లో క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు

QR code payments in Telangana RTC buses

QR code payments in Telangana RTC buses

Digital payments in tgsrtc: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి వచ్చిన తర్వాత.. మునపటికంటే ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే పెరిగిందని చెప్పవచ్చు. దీంతో బస్సులో రద్దీ కూడా బాగా పెరిగిపోవడంతో.. టీజీ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపింది. సాధారణంగా ప్రయాణికులు టికెట్ తీసుకునేందుకు చిల్లర కోసం ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో చిల్లర లేక కండెక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కావడంతో కాస్త గొడవలు తగ్గాయి. లేదంటే కండెక్టర్లతో చిల్లర గొడవలు గతంలో చాలానే జరిగేవి.

Read Also: Jani Master Remand : జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్

వీటన్నింటికి చెక్ పెడుతూ.. ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై  తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపులు ఆక్సెప్ట్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన ప్రయాణికులు సంబుర పడుతున్నారు.

ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సైతం డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్లు పొందొచ్చు. ప్రస్తుతం చాలామంది ప్రయాణికులు స్మార్ట్‌ఫోన్‌ వాడుతుండటం, డబ్బులు క్యారీ చేయకపోవటంతో చిల్లర సమస్య లేకుండా డిజిటల్ పేమెంట్లను తీసుకురానున్నారు. అలాగే ప్రయాణానికి సంబంధించిన సమస్యలను సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసేందుకు, ప్రయాణించే బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు క్యూ ఆర్‌ కోడ్‌ను కూడా పల్లె వెలుగు బస్సుల్లో ప్రవేశపెట్టనున్నారు.

Read Also: SC YouTube Channel Hacked: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్

ఆర్టీసీ ఏర్పాటు చేసిన డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్‌ కోడ్‌తో అన్ని రకాల సేవలను పొందవచ్చు. ఒక్కసారి కోడ్ స్కాన్‌ చేస్తే ఆర్టీసీకి సంబంధించిన పది రకాల యాప్‌లు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌(వెబ్‌సైట్‌), గమ్యం(ఆండ్రాయిడ్‌ ఐఓఎస్‌) తదితర సేవలను పొందవచ్చు. ప్రయాణికులకు పూర్తిస్తాయిలో సేవలందించేందుకు పల్లె వెలుగు బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్‌ విధానాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుండగా.. ప్రయాణికుల చిల్లర సమస్యకు చెక్ పడనుంది.

Read Also: YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల