Srinivas Reddy : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఆయన్ను వివిధ అంశాలపై విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీకి మొయినాబాద్ పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫామ్‌హౌస్‌లో జరిగిన కోడి పందాలపై మొదటి సారి ఇచ్చిన నోలీసులపై పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అయితే రెండో సారి మాత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈరోజు (శుక్రవారం) ఉదయం వ్యక్తిగతంగా మొయినాబాద్ పోలీసుల ఎదుట విచారణకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
Read Also: Rajasingh : సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌పై ఫిబ్రవరి 11న తోల్కట్ట గ్రామ పరిధిలోని ఎస్‌వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఓసారి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫాంహౌస్‌ను లీజుకు ఇచ్చానని విచారణలో ఆయన తెలిపారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు అందజేశారు. లీజుకు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫాంహౌస్‌పై దాడి చేసిన సమయంలో 46 కోడి కత్తులు, బెట్టింగ్ కాయిన్స్, 64 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక, మొయినాబాద్ ఫామ్‌హౌస్ తననే అని 2023లో రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రమేష్‌తో పాటు మరొకరికి కూడా లీజ్‌కు ఇచ్చినట్లు చెప్పారు. లీజ్‌కు ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే కోడిపందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఇచ్చిన లేఖలో పోచంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
Read Also: POCSO Case : యడియూరప్పకు స్వల్ప ఊరట