Harish Rao : ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయొద్దంటూ పంజాగుట్ట పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.
Also Read :Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్
ఫోన్‌ను ట్యాప్ చేయించి, తనతో పాటు తన కుటుంబ సభ్యులను హరీశ్ రావు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ సిద్ధిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హరీశ్ రావు బుధవారం రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లే తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఆర్డర్స్ ఇచ్చింది. హరీశ్‌రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీ చేసింది. పోలీసులు అరెస్టు చేయకుండా తదుపరి దర్యాప్తు చేపట్టొచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తునకు సహకరించాలని హరీశ్‌రావుకు సూచించింది.
Also Read :Prime Minister Ousted : ‘అవిశ్వాసం’తో ప్రధాని ఔట్.. ఏకమై ఓడించిన అధికార, విపక్షాలు
అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులా ? : హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అనేలా కాంగ్రెస్ సర్కారు ధోరణి ఉందని ఆయన(Harish Rao) వ్యాఖ్యానించారు. ‘‘ప్రజాస్వామిక పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అని హరీశ్ తేల్చి చెప్పారు. తెలంగాణ సమాజమే రేవంత్ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతుందన్నారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు’’ అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.ఇది ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.