Phone Tapping Case : ‘ఫోన్‌ ట్యాపింగ్‌’ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులు.. ఎవరు?

Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది. 

  • Written By:
  • Updated On - March 28, 2024 / 03:27 PM IST

Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది.  ఈ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో ఇద్దరు పోలీసు అధికారులను విచారణ టీమ్ అదుపులోకి తీసుకుంది. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, సీఐ గట్టు మల్లును బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్‌ఐబీలో సీఐగా పని చేశారు. ప్రణీత్‌రావుతో ఈ ఇద్దరు అధికారులు కలిసి ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు ? ఎవరెవరిని లక్ష్యంగా ఎంచుకున్నారు ? అనే అంశాలపై ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, సీఐ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

ఇవాళ రోజంతా రాధాకిషన్‌రావు, గట్టు మల్లును విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌కు సహకరించిన అందరినీ విచారించాలని దర్యాప్తు టీమ్ భావిస్తోంది. హైదరాబాద్‌లోని పోలీస్ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు సిటీ శివారులోని కమిషనరేట్‌నూ తాకింది. ఇప్పటికే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో ఎస్‌వోటీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను అధికారులు గుర్తించారు. ఈయన నాన్‌-క్యాడర్‌ అధికారే అయినా.. తన టీమ్‌తో ఫోన్ ట్యాపింగ్స్ చేయించి రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి రూ.కోట్లలో అక్రమ వసూళ్లు చేశారని పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు డీసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసి, విధేయతను చాటుకున్నారని సమాచారం.

Also Read : Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌.. సీబీఐ విచారణ జరిపించాలి : లక్ష్మణ్

ఎస్‌ఐబీలో సేవలందించిన 15 మంది అధికారులు, సిబ్బందికి ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధాలున్నట్లు విచారణలో గుర్తించారు. వీరంతా ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్‌లో పాతుకుపోయినట్లు తెలుస్తోంది. కొందరైతే ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసినా.. ఓఎస్డీలుగా కొనసాగారు.

Also Read :Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్‌