Harish Rao: పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. మహేశ్ కుమార్ చేసిన ఆరోపణలు చిల్లర రాజకీయాలకు దారితీస్తున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌తో బీఆర్‌ఎస్ నేతలు రహస్యంగా సమావేశమయ్యారన్న మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేయబడిన ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు ద్వారా తన స్పందనను హరిష్ రావు తెలిపారు.
Read Also: HHVM : తెలంగాణ లో వీరమల్లు టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయా..?
బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు అంటూ హరీశ్ రావు తేచిన వ్యాఖ్య గమనార్హం. మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. పెళ్లిళ్లు లేదా చావుల సందర్భాల్లో సాధారణ పరిచయాలు తప్ప, ప్రత్యేకంగా కలవడం జరగలేదు అని ఆయన స్పష్టం చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ తప్పుడు ఆరోపణలతో రాజకీయ దిగజారుదల చూపుతున్నారని, ఇది పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్థాయికి తగిన ప్రవర్తన కాదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకపోతే, ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలకే మనుగడ లభిస్తుంది. ఇది సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి విధానాన్ని అనుసరిస్తూ మహేశ్ గౌడ్ కూడా విలువలను విస్మరిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఈ తరహా ఆరోపణలు ప్రజల సమస్యలను మరుగున పడేస్తాయి. మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం వలన ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి పెట్టాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా కృషి చేయాలి అని హరీశ్ రావు చురకలు అంటించారు. ఇకపై బలహీన రాజకీయాలు మానుకొని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హరీశ్ రావు సూచించారు. ఈ నేపథ్యంలో టీఎస్ రాజకీయాల్లో మాటల తూటాల లెక్క తక్కువ కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.