Fire Break: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా కాలనీలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లిళ్లకు డెకరేషన్ కోసం ఉపయోగించే సామగ్రి గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాంలో నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం గమనించిన స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. గోదాం వద్దకు వెళ్లి చూసేసరికి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పహాడీ షరీఫ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Health : ఆయిల్ ఫుడ్స్ అధికంగా తింటున్నారా? మీ బాడీలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఇలా తెలుసుకోండి!
మంటలు తారాస్థాయికి చేరుకునేలోపే స్థానికులు గోదాంలో ఉన్న కొంత సామగ్రిని బయటకు తీయగలిగారు. అయితే, గోదాంలో భద్రపరచిన చాలా వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే అసలైన కారణం ఏమిటనేది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, కాలనీలో ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం, అత్యవసర సేవలు సమయానికి అందకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు చెలరేగిన అనంతరం అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేందుకు గంటన్నర పట్టిందని వారు ఆరోపించారు. ఈ తరహా ప్రమాదాల సమయంలో తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi : ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం: రాహుల్ గాంధీ