Cow Dung : ఓ వ్యక్తి ఇంట్లో సోదాలకు వెళ్లి హైదరాబాద్ (తెలంగాణ), కమర్దా (ఒడిశా) పోలీసుల సంయుక్త టీమ్ షాక్‌కు గురైంది. ఆ ఇంట్లో ఓ మూలన పడేసి ఉన్న ఆవుపేడలో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. దాదాపు రూ.20 లక్షలకుపైగా క్యాష్ ఆవుపేడలో దొరకడంతో అవాక్కయ్యారు. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడిది ? పోలీసులు ఈ రైడ్స్ ఎందుకు చేశారు ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Bomb Prank : యూట్యూబ్ చూసి బాంబు తయారుచేసి.. టీచర్ కుర్చీ కింద పేల్చారు
అతడి పేరు.. గోపాల్ బెహెరా. గతంలో హైదరాబాద్‌లోని ఒక అగ్రో బేస్డ్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే కంపెనీ నుంచి దాదాపు రూ.20 లక్షలకుపైగా(Cow Dung) దొంగిలించుకొని పరారయ్యాడనే అభియోగం గోపాల్ బెహెరాపై నమోదైంది. కంపెనీ ఫిర్యాదు మేరకు అతడిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అగ్రో బేస్డ్ కంపెనీలో దొంగిలించిన డబ్బును తన బావమరిది రవీంద్ర బెహెరా బ్యాంకు ఖాతాలకు గోపాల్ బెహెరా పంపాడు. ఈవిషయాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు ఒడిశాకు వెళ్లారు.
Also Read : Hypersonic Missile : భారత్ తొలి లాంగ్‌రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్
ఆ రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా కమర్దా పోలీసులను సంప్రదించారు. కమర్దా పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కలిసి బడా మందరుణి గ్రామంలోని గోపాల్ బెహెరా బావమరిది రవీంద్ర బెహెరా నివాసంలో సోదాలు చేశారు. రవీంద్ర బెహెరా ఇంటి ఆవరణలో ఎండిపోయిన ఆవుపేడ కుప్పలో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. రవీంద్ర బెహెరా ఆచూకీ దొరకలేదు. అతడి కుటుంబానికి చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాల్ బెహెరా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద ఆవుపేడలో డబ్బుల కట్టల బయటపడటాన్ని చూసి బడా మందరుణి గ్రామ ప్రజలు ఆశ్చర్య పోయారు. ఆవుపేడ నుంచి డబ్బుల కట్టలు తీయడాన్ని పోలీసు అధికారులు వీడియో తీశారు.