ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR), ప్రముఖ వ్యాపారవేత్త BLN రెడ్డి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌లకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు (ఏసీబీ) నుంచి సమాచారం లభిస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ కేసులో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈ ముగ్గురినీ ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఫార్ములా-ఈ రేసుల నిర్వహణకు సంబంధించి నిధుల మళ్లింపులు, అవకతవకలపై కొన్ని కీలక ఆధారాలు లభించాయని అధికార వర్గాలు వెల్లడించాయి. నిధుల వినియోగంపై మరింత సమాచారం రాబట్టేందుకు ఈ విచారణ చేపట్టనున్నారు.
Daaku Maharaaj Collection: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత.. 3 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
ఇదిలా ఉండగా కేసు నేపథ్యంలో కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ విఫలమవ్వడం, కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకోవడం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మరోవైపు ఈ కేసులో BLN రెడ్డి, అరవింద్ కుమార్ కూడా కీలక వ్యక్తులుగా కనిపిస్తున్నారు. అయితే.. ఈరోజు విచారణ సందర్భంగా సెక్షన్ 13(1)పై వాదనలు వినిపించారు. అవనితీ నిరోదక చట్టం సెక్షన్ 13(1) వర్తించదంటూ కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 54కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితలో లేదని అన్నారు. డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతోందని.. చేయాలనుకుంటే కేటీఆర్‌ను అరెస్ట్ చేసుకోండి అంటూ న్యాయవాది మాట్లాడారు. అయితే రేపు కేటీఆర్ ఈడీ ముందు హాజరు కానున్నారు.