Site icon HashtagU Telugu

Nice Game : హిమాన్ష్ సేఫ్‌, సెంటిమెంట్ గేమ్ షురూ

Nice Game

Nice Game

తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య ఎన్నికల వేళ సెంటిమెంట్ అస్త్రాన్ని(Nice Game)మ‌ళ్లీ తీస్తున్నారు. అన్న‌ద‌మ్ముల మాదిరిగా రాజ‌కీయం చేస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ ప్ర‌భుత్వాల మ‌ధ్య విద్యా వార్ షురూ అయింది. ఇరు రాష్ట్రా విద్యాశాఖ మంత్రులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకోవ‌డం గ‌త రెండు రోజులుగా క‌నిపిస్తోంది. అంతేకాదు, మ‌ధ్య‌లో కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్ష్ కూడా ఉండ‌డం విశేషం.

ఇరు రాష్ట్రా విద్యాశాఖ మంత్రులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకోవ‌డం (Nice Game)

ఇటీవ‌ల ఒక స్కూల్ కు వెళ్లిన హిమాన్ష్ కోటి రూపాయల విరాళంతో బాగుచేయించారు. బాలిక‌ల‌కు స్కూల్ లో మ‌రుగుదొడ్ల లేక‌పోవ‌డం చూసి చ‌లించిపోయాడ‌ట‌. గత రెండు రోజులుగా ఆ న్యూస్ సోష‌ల్ మీడియా, మెయిన్ మీడియాలోనూ వైర‌ల్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ దుస్థితిని హిమాన్ష్ బ‌య‌ట‌పెట్ట‌డాన్ని సూచిస్తూ కేసీఆర్ స‌ర్కార్ ను విప‌క్షాలు, ప్ర‌జా, పౌర సంఘాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ మీద చుర‌క‌లు వేశారు. సూచిరాత‌లు, కుంభ‌కోణాలు తెలంగాణ‌లో ఉన్నాయ‌ని కామెంట్స్ చేశారు. అంతే, ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు సెంటిమెంట్ ను రంగరించారు తెలంగాణ మంత్రులు. విద్యా వ్య‌వ‌స్థ మీద మంత్రి బొత్సా చేసిన కామెంట్ల‌ను బీఆర్ఎస్ మంత్రులు, లీడ‌ర్లు దుయ్య‌బ‌డుతూ హిమాన్ష్ ఇష్యూను నైస్ గా  (Nice Game)ప‌క్క‌కు త‌ప్పించారు.

మంత్రి బొత్సా చేసిన కామెంట్ల‌ను బీఆర్ఎస్ మంత్రులు, లీడ‌ర్లు దుయ్య‌బ‌డుతూ హిమాన్ష్ ఇష్యూను

ఇరు రాష్ట్రాల విద్యా వ్య‌వ‌స్థ‌లోని డొల్ల‌త‌నాన్ని ప‌రస్ప‌రం మంత్రులు బ‌య‌ట‌ప‌డేశారు. ఏపీలో విద్యా వ్య‌వ‌స్థ అద్భుతంగా ఉంటే ప్ర‌భుత్వ స్కూల్స్ లో అడ్మిష‌న్లు ల‌క్ష‌కు పైగా ఎందుకు త‌గ్గాయ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి క‌డిగేశారు. త్రిబుల్ ఐటీ ని ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రి బొత్సా చేసిన కామెంట్స్ తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ‌లోని అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టాయి. టీఎస్ పీఎస్సీ కుంభ‌కోణం, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్నాప‌త్రాలు లీక్, ప్ర‌శ్నాప‌త్రాల మూల్యాంక‌నంలోని లోపాలు త‌దిత‌రాల‌ను ఎత్తిచూపారు. దీంతో తెలంగాణ మంత్రులు ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎత్తిచూపుతూ ప‌నిలోప‌నిగా వోక్స్ వ్యాగ‌న్ కుంభ‌కోణం పాత క‌థ‌ను (Nice Game) బ‌య‌ట‌కు లాగారు. మంత్రి బోత్సా అన‌గానే ఉమ్మ‌డి ఏపీలో జ‌రిగిన వోక్స్ వ్యాగ‌న్ వ్య‌వ‌హారం. దాన్ని ఇప్పుడు తెలంగాణ మంత్రులు గుర్తు చేస్తూ సెంటిమెంట్ ను పండిస్తున్నారు.

Also Read : Kalvakuntla Himanshu: తాత స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు : కేసీఆర్ మనువడు హిమాన్షు

ఎన్నిక‌ల వేళ నీటి యుద్ధంతో పాటు నిధులు, నియామ‌కాలు, విభ‌జ‌న చ‌ట్టం అంశాల‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డం ప‌రిపాటిగా మారింది. ఆంధ్రాను ఒక సెంటిమెంట్ గా కొన్ని ద‌శాబ్దాలుగా కేసీఆర్ కుటుంబం వాడుకుంటోంది. రెండుసార్లు సీఎం కావ‌డానికి కార‌ణంగా కూడా అదే సెంటిమెంట్ అంటూ రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. ఇప్పుడు కూడా మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ కు ఉన్న ఒకే ఒక్క అస్త్రం ఆంధ్రా సెంటిమెంట్‌. దాన్ని మ‌రోసారి ప్ర‌యోగించ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఆ క్ర‌మంలో అందొచ్చిన బొత్సా వ్యాఖ్య‌ల‌ను ఏపీ రాష్ట్రానికి అంట‌గ‌డుతూ సెంటిమెంట్ ను (Nice Game)ర‌గిలిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ మీద దెబ్బ‌కొడుతున్నార‌ని బొత్సా మీద మంత్రి స‌బితా విరుచుకుప‌డ్డారు. మొత్తం మీద మంత్రి బొత్సా వ్యాఖ్య‌లు హిమాన్ష్ ఎపిసోడ్ ను సైడ్ ట్రాక్ ప‌ట్టింంచ‌డానికి, ఎన్నిక‌ల్లో తెలంగాణ సెంటిమెంట్ ను పండించ‌డానికి ఉప‌యోగ‌ప‌డేలా వాడేసుకున్నార‌న్న‌మాట‌.

Also Read : Bosta : పవన్ కల్యాణ్ తో గోరంత ఉపయోగం లేదు…!!