Site icon HashtagU Telugu

Nandigam Suresh : నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట

Nandigam Suresh got a huge relief in Sattenapalli court

Nandigam Suresh got a huge relief in Sattenapalli court

Nandigam Suresh : సత్తెనపల్లి సివిల్ కోర్టులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఊరట లభించింది. అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మండవ మహాలక్ష్మి అనే మహిళ 2020 ఫిబ్రవరిలో అమరావతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సురేశ్‌తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం అండదండలతో వీరిని పోలీసులు అరెస్టు చేయలేదు. ఈ క్రమంలో తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట నందిగం సురేశ్‌ లొంగిపోయారు. అతడి తరఫు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్‌ జడ్జి అతడికి బెయిల్‌ మంజూరు చేశారు.

Read Also: Mahesh Goud : ఐదేళ్లు రేవంత్ రెడ్డినే సీఎం : టీపీసీసీ చీఫ్‌

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నందిగం సురేశ్‌పై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఇటీవలే మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన జైలుకు వెళ్లారు, కానీ ఇప్పుడు ఆయన బెయిల్ పై బయటకి వచ్చారు. ఇక, ఈ కేసులో కూడా ఆయన అరెస్టు అయ్యే అవకాశం ఉండటంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యాహ్నం కోర్టులో లొంగిపోయిన ఆయన తరపు న్యాయవాదులు, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు దీనిపై విచారణ చేసి, ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు అనారోగ్య కారణాలతో చికిత్స కోసం బయట ఉన్న నందిగం సురేశ్‌కు ఈ కేసులో కూడా బెయిల్ మంజూరయ్యింది.

Read Also: Fact Check : రాష్ట్రపతి భవన్‌లో తొలి పెళ్లి వేడుక.. మీడియా నివేదికలన్నీ తప్పుల తడకలే