MLC Kavitha Tour: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు.

Published By: HashtagU Telugu Desk
Kavitha

Kavitha

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలలో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.

అలాగే జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో ఎమ్మెల్సి కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ బోనాలు వేడుకలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఆక్లాండ్ లోని గణేష్ టెంపుల్ లో ఉదయం 11కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే ఆక్లాండ్ లో ఉదయం 9 కి వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ సమ్మేళనం లో కవిత పాల్గొంటారు. సాయంత్రం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో ఆస్ట్రేలియాలోని తెలంగాణీయులతో సమావేశం అవుతారు. ఆల్బర్ట్ వార్ మెమోరియల్ హాల్ లో ఈ సమావేశం జరగనుంది.

Also Read: Pawan Kalyan: వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు, పవన్ పై కేసు నమోదు

  Last Updated: 13 Jul 2023, 05:34 PM IST