Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టి వేయబడ్డాయని చెప్పారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
Read Also: DANGER: రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?
ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని విమర్శించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయమన్నారు. గ్రూప్ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొందన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు. గ్రూప్- 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదంటే పారదర్శకంగా ఉద్యోగ నియామకాల పట్ల మీకు ఏ మేరకు చిత్తశుద్ది ఉందో తేటతెల్లమవుతుంది. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారి లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ యువతకు, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మీరు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం. గ్రూప్- 1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్వక్ష్యం వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయి. గ్రూప్ -1 పరీక్షలపై అభ్యర్థులు దాఖలు చేసిన కేసులు న్యాయస్థానాల పరిధిలో ఉండగానే గౌరవ ముఖ్యమంత్రి గారైన మీరు, మీ కేబినెట్ లోని పలువురు మంత్రివర్యులు గ్రూప్ -1 నియమకాల గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. త్వరలోనే ఈ నియామకాల ప్రక్రియ ముగించబోతున్నట్టు ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు కూడా అభ్యర్థుల్లో అనుమానాలు పెరగడానికి కారణమయ్యాయి అని కవిత లేఖలో పేర్కొన్నారు.
Read Also: Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు