Site icon HashtagU Telugu

Legislative Council Explained : శాసనమండలి ఎవరి కోసం ? రిజర్వేషన్లు ఉంటాయా ?

Legislative Council Mlc Elections Reservations Andhra Pradesh Telangana Ap

Legislative Council Explained : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, గ్రాడ్యుయేట్ల సంఘాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాసన మండలి వ్యవస్థ మొదటి నుంచే అమల్లో ఉంది.  ఇంతకీ ఇందులో ఎవరికి ప్రాతినిధ్యం లభిస్తోంది ? మండలి ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉంటాయా ? అన్ని వర్గాలకు ఇందులో చోటు కల్పించే ప్రయత్నం జరుగుతోందా ? 

Also Read :YSRCP : త్వరలోనే వైఎస్సార్ సీపీలోకి మరో కీలక కాంగ్రెస్ నేత

రిజర్వేషన్ల విషయంలో..

శాసన మండలి(Legislative Council Explained)లో ప్రస్తుతానికి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. శాసనసభలలో రిజర్వేషన్లు అమలవుతాయి. వాటి ప్రకారమే ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు జరుగుతుంటుంది. అయితే శాసన మండలిలో రిజర్వేషన్లు ఉండవు.  దీంతో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కలిగిన వారు, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు మాత్రమే మండలిలోకి అడుగుపెట్ట గలుగుతున్నారు. మైనారిటీలు, దళితులు, బీసీలు, మహిళలకు శాసన మండలిలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చాలా కాలంగానే ఉంది. దీనిపై రాజకీయ పార్టీల నేతలు మరోసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది.  

Also Read :Lord Shiva Favourite Colour: మహాశివరాత్రి నాడు మ‌హిళ‌లు ఏ రంగు గాజులు ధ‌రిస్తే శుభం క‌లుగుతుంది?

ప్రజాభిప్రాయ వ్యక్తీకరణ కోసం..

శాసనసభ, శాసన మండలి అనే రెండు సభలు ఉంటే ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు ఎక్కువ అవకాశం ఉంటుందని భారత రాజ్యాంగ రూపకర్తలు భావించారు.  శాసన మండలి వల్ల సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించవచ్చని వారు అనుకున్నారు. మైనారిటీలు, దళితులు, మహిళలు, బీసీలు, కార్మిక వర్గాలకు మండలిలో తప్పకుండా చోటు దక్కేలా రిజర్వేషన్లను చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. 

గ్రాడ్యుయేట్ కాకున్నా.. టీచర్ కాకున్నా.. 

శాసన మండలి ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ కాని వారు కూడా పోటీ చేయొచ్చు. టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో  టీచర్ కాని వారు కూడా పోటీ చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి ఓటు హక్కు మాత్రం ఉండదు. సదరు ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఓటు హక్కు లేని వ్యక్తి,  పోటీ చేసే హక్కు ఎలా ఉంటుందో ఎవరికీ అంతుచిక్కదు.రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు, రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేందుకు శాసన మండలి సభ్యులకు ఓటుహక్కు ఉండదు. ఏ అధికారాలూ ఇవ్వకుండా శాసన మండళ్ల నిర్వహణ ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తుంది.