Site icon HashtagU Telugu

CM Revanth : రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తాడు – ఎమ్మెల్యే కౌశిక్

Paadi Cm

Paadi Cm

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి శాపాలకు గురవుతారని, చివరకు “కుక్క చావు” చస్తాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, 6 గ్యారంటీల పేరిట ప్రజలను మోసగించారని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాదని, వారిని మోసం చేయడం వల్ల రేవంత్ రెడ్డికి శాపనార్థాలు తప్పవని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?

తన విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ రాష్ట్రంలోని పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అంటూ అప్రామాణిక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ప్రతిఫలంగా రేవంత్ పాలన ప్రజల చేతనే తిరస్కరించబడుతుందని, త్వరలోనే ఆయన నాయకత్వం పరాజయాన్ని చవిచూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడు అయిన కౌశిక్ రెడ్డి, ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ, ప్రజలకు మేలు చేసేవాడైతే నేడు రాష్ట్రం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేదే కాదని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ ఎత్తుగడలలో భాగమని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతుండగా, బీఆర్ఎస్ మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకుందని సమర్థించుకుంటోంది. అయితే వ్యక్తిగత వ్యాఖ్యలు అనుచిత పదజాలం ఉపయోగించడం వల్ల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతున్నది.

CM Revanth : ‘దివాలా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది’ సీఎం కు బిఆర్ఎస్ కౌంటర్