Mahbubnagar Earthquake : రెండు రోజుల క్రితమే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ప్రజలు భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు 3 సెకన్ల నుంచి 7 సెకన్ల పాటు భూమి కంపించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప కేంద్రం ములుగు జిల్లాలోని మేడారంలో ఉందని గుర్తించారు.
Also Read :Vehicles Registrations : వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో కొని ఏపీలో రిజిస్ట్రేషన్లు.. రంగంలోకి రవాణాశాఖ
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ..
తాజా వార్త ఏమిటంటే.. మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ ఉదయం 6 గంటల 45 నిమిషాలకు స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భూప్రకంపనలను ఫీలయ్యారు. భయంతో చాలాసేపు ఇళ్ల బయటే ఉండిపోయారు. ఈ భూకంప(Mahbubnagar Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంప తీవ్రత 5 పాయింట్ల కంటే ఎక్కువే ఉంది. అంటే.. అప్పటి కంటే తక్కువ తీవ్రతతోనే మహబూబ్ నగర్ జిల్లాలో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రాన్ని కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో గుర్తించారు. ఇక ఇవాళ తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో భూకంపం వచ్చింది. కంగ్రా, చంబా, లాహౌల్, కులు, మండి ప్రాంతాల్లోని ప్రజలు భూప్రకంపనలను ఫీల్ అయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది.
Also Read :5 Lakh Runs : 5 లక్షల రన్స్.. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తిరుగులేని రికార్డు
భూకంపాలు ఎందుకు వస్తాయి ?
భూకంపాలకు ప్రధాన కారణం భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదాన్నొకటి ఢీకొనడమే. భూమి లోపల ఏడు టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి.ఈ ప్లేట్లు ఏదో ఒక ప్రదేశంలో ఢీకొన్నప్పుడు, అక్కడ ఒక ఫాల్ట్ లైన్ జోన్ ఏర్పడుతుంది. భూమి ఉపరితలం యొక్క మూలలు వంగి ఉంటాయి. భూమి ఉపరితలం యొక్క మూలలలోని వంపు కారణంగా.. అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అక్కడి ప్లేట్లు విరిగిపోతాయి. ఈ ప్లేట్లు విరిగిపోవడం వల్ల, లోపల ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని వెతుకుతుంది. దాని కారణంగా భూమి కంపిస్తుంది. దాన్నే మనం భూకంపంగా చెప్పుకుంటాం. చాలా తేలికపాటి కేటగిరీ భూకంపాలు రిక్టర్ స్కేల్‌పై 3.0 నుంచి 3.9 తీవ్రతను కలిగి ఉంటాయి. ఇవి సంవత్సరంలో 49వేల సార్లు వస్తాయి.