Minister Sridhar Babu: బీజేపీ నాయకులు చేసిన మూసి నిద్రపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పందించారు. సినిమా సెటప్ తో మూసీ నిద్ర చేశారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి మకాం మార్చుకుంటే మాకేం ఇబ్బంది లేదు. మూసీ పునరుజ్జీవం DPR పూర్తి కాకముందే బీఆర్ఎస్ , కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితాన్ని అందిద్దామా లేదా బీజేపీ నాయకులు చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆ బాధలు ఎలా ఉంటాయో బీజేపీ నాయకులకు తెలిసేది. మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు ముందే సెటప్ చేసుకొని, దోమలు రాకుండా ముందే మందులు కొట్టి, ఆలౌట్స్ పెట్టుకొని మూసీ నిద్ర చేశారని విమర్శలు చేశారు.
Also Read: Kailash Gahlot : కేజ్రీవాల్‌కు షాక్.. బీజేపీలోకి ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్
ఇంకా మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మూసీ పరివాహక ప్రాంతంలో మకాం మార్చుకుంటే మాకేం ఇబ్బంది లేదు. మూసీ పునరుజ్జీవం DPR పూర్తి కాకముందే బీఆర్ఎస్, కేటీఆర్ ఏదో ఏదో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మూసి పునరుజ్జీవం PPP మోడల్ లో ప్రభుత్వం వెళ్ళదల్చుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. లగచర్లలో పేదల భూములను మేము ఎక్కడ బలవంతంగా గుంజుకోలేదు. ప్రజాస్వామిక పద్ధతిలో పబ్లిక్ ఇయరింగ్ పెడితే కలెక్టర్ పైన, ఇతర అధికారుల పైన దాడి చేశారని తెలిపారు.
కొడంగల్ బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు ఏ విధంగా మాట్లాడాడో అందరికీ తెలుసు. అధికారులు వస్తే తన్నండి , కొట్టండని గ్రామస్తులు రెచ్చగొట్టాడు. బీఆర్ఎస్ హయంలో మల్లన్న సాగర్ లో ఏ విధంగా భూములు గుంజుకున్నారో తెలుసని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.